oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam

0
2602

పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనం ఇచ్చే ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. దేవకన్యలు ద్వారపాలకులై ఉండగా, నాలుగుపడగల నీడన శివలింగ వెలసిన అధ్బుత శివాలయముగా విరాజిల్లుతుంది. మరి ఈ శివాలయంలో స్వామివారిని ఏమనని పిలుస్తారు? ఈ ఆలయంలోని ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.1 oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణజిల్లా, మచిలీపట్నంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఉన్నది. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినదిగా చెబుతారు. అయితే తూర్పు ముఖంగా నిర్మించబడిన ఈ దేవాలయ ప్రవేశ ద్వారం గోపురం పైన మూడు కలశాలు ఉన్నాయి. ఇక ఆలయ ప్రవేశంలో ద్వారపాలకులైన వాసంతి, సుష్మా అనే దేవకన్యలు భక్తులకు స్వాగతమిస్తున్నట్లు కనువిందు చేస్తారు.2 oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam

ఆలయ గర్భగుడిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సకల భూషణలతో అలంకరించబడి మహాతేజస్సుతో భక్తులకి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో క్షేత్ర పాలకుడు నగరేశ్వర రూపంలో ఉన్న పరమేశ్వరుడు. శ్రీ నగరేశ్వరస్వామి వారు ఇచట పంచ నాగపడగల నీడన శివలింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఇక ఈ స్వామి ఎదరుగా అయన వాహనం అయినా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.3 oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam

ఇక స్వామివారి ప్రక్కనే పార్వతిమాత ఆలయం ఉంది. ఇక్కడ పార్వతీదేవి నాలుగు చేతులతో, త్రిశూలాన్ని, ఢమరుకాన్ని ధరించి, అభయ వరద ముద్రలతో భక్తులకి కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో రాత్రి సమయాల్లో ఇచ్చే మహా హారతి వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహా హారతిని ఎక్కవు మంది భక్తులు దర్శిస్తారు. అయితే ఈ ఆలయ ప్రాగణంలోనే అనేక ఉపాలయాలు ఉన్నాయి.4 oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam

ఈ ఆలయంలో ఉన్న నవగ్రహ మంటపానికి ప్రక్కనే సహస్ర లింగేశ్వరుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఒకే శివలింగాకృతిలో 1008 శివలింగాలు కనిపిస్తాయి. ఈ ఆలయానికి దక్షిణ బాగాన వైకుంఠ పురం ప్రతిష్ఠితమై ఉంది. ఈ వైకుంఠ పురంలో శ్రీనివాసుడు దివ్యమంగళ సరూపుడై భక్తులకి దర్శనమిస్తాడు.5 oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam

ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, నాముతో తయారుచేయబడిన 365 శివలింగాలను ప్రతిష్టించి చేసే మహాలింగార్చన ఈ ఆలయంలో మరో ప్రత్యేకతను పొందింది. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.6 oke shivalingakruthilo 1008 shivalingalu kanipinche athbutha shivalyam