Written By: Chintapalli SivaSanthosh
మన ఇంట్లో టీవీ లో తాతయ్య బామ్మ సినిమా చూస్తున్నప్పుడు, నాన్న వార్తలు చూస్తున్నప్పుడు, అమ్మ ,అక్క,చెల్లి, వదిన సీరియల్ చూస్తున్నప్పుడు, పిల్లలు కార్టూన్ ఛానెల్ చూస్తున్నప్పుడు, లేదా మనమే క్రికెట్ చూస్తున్నప్పుడు మధ్య మధ్య లో యాడ్స్ వస్తూ మన చికాకు ను తెప్పిస్తాయి. కానీ ఆ చికాకు తెప్పించే యాడ్స్ ను గనక మనం సరిగ్గా చూస్తే, అన్ని యాడ్స్ కాదు కొన్ని యాడ్స్ మనకి చికాకు ను కాదు మన లో చిరునవ్వు ను తెప్పిస్తాయి. అవేంటో మన చుట్టే తిరుగు తున్నటు, మనల్ని మనకే చూపిస్తాయి ఆ యాడ్స్. ఒక్కొక్క సారి మన మరిచిపోయిన వ్యక్తులు ని, జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి కూడా.
కొన్ని యాడ్స్ చివర వచ్చే Captions మనలో మార్పు తెచ్చేలా,మనకే ఎదో చెబుతున్నట్టుగా ఉంటాయి.అలాంటి వాటి లో కొన్ని
1.Tooth Paste : స్మైల్ చేయండి…స్టార్ట్ చేయండి
2.3 Roses Tea : మామకారపు మాధుర్యం
3.Aashirvaad – అమ్మ ఆశీర్వాదం ప్రతిరోజు
4.Dairy Milk – మంచిని ఆశిద్దాం… తియ్యని వేడుక చేసుకుందాం
5.Sunfeast Mom'magic : హృదయం లో భాగం
6. Mazza – మనస్సు చిందులే స్తుంది.
7.PhonePay – చేస్తూనే వెళ్ళు…ఎదుగుతూ వెళ్ళు
8.Rin – మెరుస్తూ ఉండండి…
9.Idea – ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.
10.అంబికా దర్బార్ బత్తి – భగవంతుని కి భక్తుడికి అనుసంధానమైనది
11.KINLEY Water – బొట్టు బొట్టులో నిజాయితీ
12.MTR – భోజనంలో ఎదో విశేషం ఉంది.
13.Tata Salt – దేశపు ఉప్పు…దేశపు ఆరోగ్యం
14.Parokya Milk – క్షేమం,ప్రేమతో….మన గ్రామాల నుంచి
15.Axis Bank – మనస్ఫూర్తిగా ఓపెన్
16. Lalitha Jewellers – డబ్బులు ఎవరికి ఉరికే రావు