ఒక్క ఆంజనేయస్వామి మాత్రమే చేయగల అంశాలు ఏంటో తెలుసా?

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. మరి ఒక్క హనుమంతుడు మాత్రమే చేయగల ఆ అంశాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రాన్ని దాటడం: 

anjaneyuduశ్రీరాముడు సీత జాడని అన్వేషిస్తూ ఒక సముద్రం దగ్గరికి రాగ, వానర సైన్యంలో సముద్రాన్ని దాటగలిగే శక్తి ఒక హనుమంతుడికి మాత్రమే ఉంది. అందుకే జాంబవంతుడు సముద్రాన్ని దాటి వెళ్ళిరాగలిగే శక్తి ఒక్క హనుమంతుడికి మాత్రమే ఉందని సూచిస్తాడు. అంతేకాకుండా హనుమంతుడికి బాల్యంలో తానూ కోరుకున్న చోటుకి వెళ్లగలిగే శక్తి, ఏ ఆయుధం అతడిని గాయపరచదు అనే వరాన్ని బ్రహ్మ దేవుడు ఇస్తాడు. ఇలా సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతాదేవిని కనిపెట్టగలిగాడు హనుమంతుడు.

లంకలో ఉన్న సీతాదేవిని కనిపెట్టడం: 

anjaneyuduలంక అంటే ఒక ద్విపం, చుట్టూ నాలుగు వైపులా నీరు అనేది ఉంటుంది. అయితే రావణుడు తన రాజ్యంలోకి శత్రువులు ఎవరు రాకుండా లంకకి కాపలాగా లంఖిణి నియమిస్తాడు. లంఖిణి ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా లంకలోకి ప్రవేశించడం అనేది అసాధ్యం. అయితే సీతాదేవిని వెతుకుంటూ వచ్చిన హనుమంతుడు కోతి రూపంలో లంకలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా లంఖిణి హనుమంతుడిని అడ్డుకుంటుంది. లంకలో ఉన్న అందాలను చూసి త్వరగా వచ్చేస్తాను అని కోతి రూపంలో ఉన్న హనుమంతుడు చెప్పగా, కోపంతో లంఖిణి హనుమంతుడి పైన దాడి చేయాలనీ చూడగా హనుమంతుడి ఒక్క వేటుతో లంఖిణి విల విలలాడిపోతుంది. అప్పుడు బ్రహ్మ తనకి ఇచ్చిన వరం గుర్తుకువస్తుంది, ఎప్పుడైతే నువ్వు ఒక వానరుడి చేతిలో ఓడిపోతావో అప్పుడు లంకకి ముప్పు తప్పదు అదే రావణుడి పతనానికి కారణం అని చెబుతాడు. అయితే ఓడిపోయిన లంఖిణి అశోకవనంలో ఉన్న సీతాదేవి జాడని చెబుతుంది. ఇలా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంఖిణి వంటి రాక్షసురాలను ఓడించి సీతాదేవి జాడని కనిపెట్టగలిగాడు.

అక్షయ కుమార సంహరణ: 

anjaneyuduసీతాదేవిని కలసి శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని చెప్పిన తరువాత, లంకలో చేరిన హనుమంతుడు కొన్ని ప్రాంతాలను నాశనం చేస్తుండగా రావణుడు తన కుమారుడైన అక్షయ కుమారుడిని పంపగా అతడు హనుమంతుడి చేతిలో మరణిస్తాడు. అప్పుడు రావణుడు ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుడి పట్టుకొని సభలో మాట్లాడి తోకకి నిప్పు అంటించగా, అక్కడి నుండి బయటపడిన హనుమంతుడు తన తోకతో లంక అంతటికి నిప్పి అంటిస్తాడు. ఈవిధంగా లంకకి వెళ్లి సీతాదేవిని కలుసుకొని రావణుడి ఎదుటే లంకని దహనం చేసే అంతటి శక్తి ఒక్క హనుమంతుడికి మాత్రమే ఉంది.

హనుమంతుడు – విభీషణుడు :

anjaneyuduరావణుడి తమ్ముడు విభీషణుడు. రావణుడు సీతాదేవిని అపహరించడం విభీషనుడికి ఇష్టం లేదు. తన అన్నతో సీతాదేవిని తిరిగి రాముడికి అప్పగించాలని చెప్పినప్పటికీ రావణుడు లెక్కచేయలేదు. ఆ సమయంలో శ్రీరాముడి కలిసేందుకు వెళ్లిన విభీషనుడికి అండగా ఉండి శ్రీరాముడి దగ్గరికి తీసుకువెళ్ళింది హనుమంతుడే, శ్రీరాముడి శరణు విభీషణుడి కోరి రావణుడితో యుద్ధం చేసే సమయంలో శ్రీరాముడికి సహాయం చేస్తాడు.

సంజీవిని పర్వతం: 

anjaneyudu

లంకలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్ర్తాన్ని సందించగా లక్ష్మణుడు సృహ కోల్పోతాడు. అప్పుడు లక్ష్మణుడికి సృహ రావాలంటే ఒక్క సంజీవిని మొక్క వలెనే సాధ్యం అని తెలియడంతో హిమాలయాల్లో సంజీవిని పర్వతాన్ని కనుగొని అందులో ఏది సంజీవిని మొక్కు అర్ధం అవ్వగా మొత్తం పర్వతాన్నే పెకిలించి తీసుకొని వస్తాడు.

ఈవిధంగా హనుమంతుడు మాత్రమే చేయగలిగే అంశాలుగా వీటిని చెప్పుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR