Home Unknown facts ఒకే పీఠం పైన రెండు సాయినాథుని విగ్రహాలు ఉండే ఆలయం

ఒకే పీఠం పైన రెండు సాయినాథుని విగ్రహాలు ఉండే ఆలయం

0

షిరిడి సాయిబాబాను హిందువులు, ముస్లింలు రెండు మతాల వారు పూజిస్తారు. ఎందుకంటే రెండు మతాల పద్ధతిలో అయన బోధనలు చేసాడు. సాయిబాబా యొక్క ముఖ్యమైన వాక్కు అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్. సాధువు, యోగి అయినా ఈయనను హిందువులు శివుని అవతారంగా కొలుస్తుంటారు. ఇది ఇలా ఉంటె, సాయిబాబా వెలసిన ప్రసిద్ధ ఆలయాలు చాలానే ఉన్నాయి కానీ ఇక్కడి ఆలయంలో ఒకే పీఠం పైన రెండు సాయినాథుని విగ్రహాలు పూజలను అందుకోవడం విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sai Baba Statues

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, విజయవాడలోని ముత్యాలంపాడు లో శ్రీ సాయిబాబా ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 1988 లో నిర్మించారని తెలుస్తుంది. అయితే అప్పుడు ఒక శాస్రిగారిచే తయారుచేసిన ఆకర్షణ యంత్రంతో ఒక చిన్న సాయిబాబా విగ్రహం ముందుగా ప్రతిష్టించారు. ఆ తరువాత ఒక 10 సంవత్సరాల తరువాత సాయిబాబా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ ఆలయ స్థూపాకార గోపురం చాలా దూరం వరకు కూడా కనిపిస్తుంది. ఈ గోపురంపైన గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఇక ఈ మందిరంలో ఉదయం కాగడ హారతితో బాబా అర్చనలు ప్రారంభం అవుతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి గురువారం కూడా స్వయంగా భక్తులే అభిషేకాన్ని నిర్వహిస్తారు.

ఈ ఆలయ ప్రాంగణంలో అశ్వత్థ వృక్షం క్రింద నాగేద్ర స్వామివారి పుట్ట ఉంది. ఈ పూటా సమీపంలో సర్పాకృతి ఉందని భక్తులు ఈ దేవతావృక్షానికి, సర్పాకృతికి కూడా పూజలు చేస్తుంటారు. ఇక్కడనే ఉన్న మద్దివృక్షం క్రింద గురుస్థానం ఉంటుంది. ఇక ఇక్కడ స్వామివారికి ఇష్టమైన లెండివనం కూడా ఏర్పాటుచేశారు.

ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం పల్లకి సేవ చాలా ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి గురువారం, ఆదివారం భక్తులు భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

Exit mobile version