Paala vanti neeru pravahinche punya kshetram

0
2474

మన దేశంలో కొండల మధ్య గుహలో వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆలా కొండ గుహల్లో వెలసిన ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఇక్కడ శివుడు, లక్ష్మి నరసింహ స్వామి వార్లు కొలువై భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. punyakshetramతెలంగాణ రాష్ట్రం, జనగామ నుండి 30 కి.మీ. దూరంలో పాలకుర్తి నందు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభువు క్షిరగిరి అనే పర్వతం పైన ఉంది. ఈ క్షేత్రాన్ని శివపంచాయత క్షేత్రం అంటారు. ఇక్కడ శివుడు సోమేశ్వర స్వామిగా, శ్రీ మహావిష్ణువు లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకుంటున్నారు. punyakshetramరెండు పర్వత గుహల మధ్యలో ఈ స్వామివార్లు స్వయంభువులుగా వెలసినారు. అయితే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గుహనందు ఉధ్భవించే నీటి పాయ కొండపై గల కోనేటి నుండి అంతర్వాహినిగా సాగి ఈ గ్రామం చెరువు నందు కలసి అది పాలేరుగా మారి చివరకి గోదావరి నదిలో కలుస్తుంది. punyakshetramఈ పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు కొండ గుహల నుండి పాలవంటి నీరు ప్రవహించేది. అందుకే ఈ ప్రాంతానికి మొదట్లో పాలకుర్తికి గా పిలువబడుతూ క్రమేణా పాలకుర్తి అనే పేరు వచ్చినదని చెబుతారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు శ్రీ సోమేశ్వరస్వామి వారికీ లక్ష బిల్వార్చన జరుగుతాయి. అదేవిధంగా అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన, శ్రీ లక్ష్మీనరసింహస్వామికి లక్ష తులసి అర్చన చాలా పవిత్రంగా జరుగుతాయి. ఈ క్షేత్ర పవిత్రతను తేనెటీగలు ఎల్లవేళలా కాపాడుతాయని చెబుతుంటారు. punyakshetramఇలా కొండ గుహల్లో వెలసిన ఆ స్వామివార్లని దర్శించుకొనడానికి భక్తులు దూరప్రాంతాల నుండి తరలివస్తుంటారు.