సిటీ లైఫ్ కి అలవాటు పడి చాలా మంది తాజా ఆహారానికి దూరమవుతున్నారు. ఫ్రెష్ కూరగాయలే కాదు పాలు కూడా దొరకడం లేదు. పాడి లేకపోవడంతో ప్యాకెట్ పాలు మాత్రమే దిక్కు అవుతున్నాయి. అయితే విడిపాలు మంచిదా, లేదా ప్యాకెట్ పాలు మంచివా అంటే కచ్చితంగా ఈరెండింటి మధ్య తేడా తెలుసుకుని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు వైద్యులు.
పాలు కొనే సమయంలో పాశ్చరైజ్డ్, పాశ్చరైజ్ చేయని పాల మధ్య తేడాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్యాకెట్ లో లభించే పాలు పాశ్చరైజ్డ్ చేయబడి ఉంటాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను వేడి చేసి చల్లార్చి ఆ తరువాత ప్యాకెట్లలో నింపుతారు.
ఇలా చేస్తే పాలల్లో ఉండే క్రియులు బ్యాక్టిరీయా నశిస్తాయి. ఇక ప్యాకెట్ పాలల్లో టోన్డ్ బట్టీ వెన్న కూడా ఉంటుంది. ప్రముఖ కంపెనీ బ్రాండ్ ల పాలు కల్తీ తక్కువ. ఇక లూజ్ పాలు కొనేవారు పితికిన గంటలోపు మీకు అందిస్తే మంచిది, లేట్ అయితే అందులో పాల పొడిరసాయనాలు కలిపే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఇలాంటివి చేస్తూ దొరుకుతున్నారు కూడా.
ఇక విడిగా పాలను కొన్నప్పుడు తప్పనిసరిగా ఓసారైనా కాచిన తరువాత మాత్రమే వాడాలి. ఎప్పుడయినా వేడి చేసుకున్న పాలు మాత్రమే తాగాలి. గంటల తరబడి నిల్వ చేసిన పాలు మంచిది కాదు. అసలు ఒక్క రోజు మించి పాలు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవద్దు.