పద్మాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు

వరంగల్ నగరంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు కాకతీయుల కాలంలో వరంగల్ ని ఓరుగల్లు అని పిలిచేవారు. కాకతీయ రాజులూ వారి పరిపాలనలో ఓరుగల్లు లో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను నిర్మించారు. అయితే వరంగల్ జిల్లాలోని హనుమకొండ లో పద్మాక్షి గుట్ట పైన వెలసిన పద్మాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

guttaloవరంగల్ జిల్లా, హనుమకొండ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న గుట్టపైన పద్మాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన దేవాలయం. పద్మాక్షి అమ్మవారు కాకతీయుల ఆరాధ్య దైవం. అయితే 10వ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయిస్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని చరిత్ర చెబుతుంది. కాకతీయుల రాజులు అమ్మవారని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్థముహుర్తాలకు, శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్దం ప్రకటించి విజయం సాధించే వారట.

 

guttaloఈ ఆలయం క్రీ.శ. 1117 లో నిర్మించబడింది. ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు. ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు. గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు. దీనిమీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్తూపం అని, జైనుల దేవత క్దలలయకు అంకితం చేసారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

 

guttaloఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది. మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను, నగరవాసులను ఆకర్షిస్తున్నది. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బదాసీ అనే జైనమందిరం ఉండేదని చరిత్రకారులు చెపుతున్నారు. గుడి ఆవరణలో ఇప్పటికీ జైనతీర్ధంకరుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి.

 

guttaloగుట్ట పై భాగంలో భక్తులు సేదతీరడానికి ఆలయ ప్రాంగణం ఉంటుంది. అక్కడి నుండి చూస్తే హన్మకొండ నగరమంతా కనిపిస్తుంది. ఈ ఆలయం లో ఉన్న గరుడ రూపాన్నే కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకంగా ఉపయోగించుకొన్నాడట. అంతేకాదు జైన తీర్ధంకరులు శాంతినాద తమ లాంఛనానికి కూడా వాడుకొన్నారట .ఇది మరో గొప్ప విశేషం. పద్మాక్షి దేవి ఆలంయంలో ఒక అద్దం ఉండేదట. అద్దం వెనుక నుండి ఉన్న సొరంగం భద్రకాళి దేవాలయం వరకు ఉండేదని, కాలక్రమంలో దానిని కాస్తా మూసివేశారని కొందరు అంటున్నారు.

 

guttaloపద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంది. ఇక్కడ ప్రతి యేటా బతుకమ్మ, దసరా ఉత్సవాలు తెలంగాణ లోనే అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

 

guttalo

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR