పాలకొల్లు లో వెలసిన శ్రీ క్షిరారామలింగేశ్వరస్వామి ఆలయం గురించి కొన్ని నిజాలు

0
2404

ఈ ఆలయంలో శివుడు శ్రీ క్షిరారామలింగేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలో శివుడు బాణం వేస్తే భూమిలో నుండి పాలు ఉబికి వచ్చాయని స్థల పురాణం చెబుతుంది. మరి శివుడు ఎందుకు అలా పాలని భూమిలోనుండి పైకి తీసుకొచ్చాడు? ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పచ్చిమగోదావరి జిల్లా, నర్సాపురానికి 8 కీ.మీ. దూరంలో పాలకొల్లు అనే గ్రామంలో శ్రీ క్షిరారామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అయితే ఈ గ్రామం నందు శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి స్వహస్తాలతో స్వామివారిని ప్రతిష్టించారని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఈ పాలకొల్లు ఆలయం ఒకటి.

2-Lingam

ఇక స్థల పురాణానికి వస్తే, పూర్వం ఉపమన్యుడు అనే బలభక్తుడు పాలకై పరమేశ్వరుని ప్రార్ధించగా అయన కరుణించి తన త్రిశూలాన్ని భూమి పైన దించగా భూగర్భం నుండి క్షిరము ఉత్భవించినది. అందుకే ఈ ప్రాంతం “క్షిరపురి”గా ప్రసిద్ధికెక్కింది. ఇదే కాలక్రమేణా ‘పాలకులను’ గా పాలకొల్లుగా పిలుస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ప్రతిష్టించిన అమృతలింగ శిరోభాగాన్ని శ్రీరాముడు భక్తి శ్రద్దలతో అర్చించుటకై శ్రీ క్షిర రామలింగేశ్వర స్వామి అనే పేరు ఈ స్వామికి స్థిరపడింది. శ్రీరాముడు బ్రహ్మహత్య దోషనివారణకై రామలింగేశ్వరంతో పాటు కాశి నుండి తెచ్చిన శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది.

3-Temple

ఇక ఆలయ విషయానికి వస్తే, క్రీ.శ. 918 ప్రాంతంలో మొదటి చాళుక్యభీముడు ఈ ఆలయ నిర్మాణం గావించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలి గోపురం. ఇది ఆకాశాన్ని అంటేలా 125 అడుగుల ఎత్తులో 9 అంతస్తులుగా ఉంది. ఈ గోపురం పై అంతస్థు వరకు వెళ్ళడానికి మెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

4-Lingam

ఇక్కడ కొద్దీ దూరంలో ఒక చెరువు ఉంది. ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. స్వామివారికి  ప్రతిరోజు చేయబడే అభిషేక క్షిరంతో ఈ చెరువు నిండిపోయి ఉండటం వలన పాలకులను అని పిలవబడుతూ  ప్రస్తుతం పాలకొల్లుగా పిలువబడుచున్నది. ఇక ఈ ఆలయంలో స్వామి వారు తెల్లగా, పాలవలె మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున ఉన్న శివలింగం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

5-Tepmle

ఈ ఆలయంలో వెలసిన అమృత లింగాన్ని బ్రహ్మాది దేవతలు వెంటరాగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్టించి శివుని కోరికపై క్షేత్రపాలకుడిగా లక్ష్మీసమేతుడై జనార్దనస్వామివారిగా ఈ క్షేత్రంలోనే కొలువై భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు.

6-Lingam

ఇలా పరమశివుడు భక్తుని కోరిక మేరకు పుష్కరిణి పాలకొలనుగా మార్చి, ఇక్కడే అమృతలింగమై వెలసి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.