పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం ఎక్కడ ఉంది ?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నవి. అయితే సమస్త జీవరాశికి ఆధారమైన పంచభూతాలు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ శివుడు ఐదు చోట్ల వెలిసాడు. వాటినే పంచభూత దేవాలయాలని అంటారు. మరి పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం ఇక్కడ ఎలా వెలసింది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Jambukeswaram Temple

తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి జిల్లాలో, తిరువనక్కవాల్ అనే గ్రామంలో శ్రీ జంబుకేశ్వరాలయం ఉంది. ఇక్కడ శివుడూ జలరూపంలో వెలిశాడని చెబుతారు. అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. అయితే ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెబుతారు. ఇతడి కట్టిన ప్రాకారానికి పనిచేసినవారికి రోజు కొంత విబూది ఇచేవాడంట. పనిచేసి విభూధిని తీసుకెళ్లిన వారికీ ఇంటికి వెళ్ళగానే ఈ విబూది బంగారం లాగ మరెందట. దీంతో ఆ ప్రాకారాన్ని నిర్మించడానికి స్వయంగా ఆ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడని స్థానిక భక్తుల నమ్మకం.

Jambukeswaram Temple

ఇక పురాణానికి వస్తే, ఒకరోజు కైలాసంలో పార్వతీపరమేశ్వరులు మాట్లాడుతుండగా పార్వతీదేవి శివుడిని ఎగతాళి చేయగా, శివుడు బాధపడి కైలాసాన్ని వదలి భూలోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించగా, దాంతో భూలోకానికి వచ్చిన ఆ దేవి కావేరి నది తీరాన గల ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడి జంబూ ద్విపంలో నివాసాన్ని ఏర్పరుచుకుంది. పార్వతీదేవి ఆ నది నీటిని తెచ్చుకొని తన శక్తితో ఆ నీటితోనే ఒక లింగరూపాన్ని తయారుచేసి దానిని ఒక నేరేడు చెట్టు కింద ప్రతిష్టించి పూజలు చేస్తూ ఉండేది. ఆ వృక్షం జంబూ ముని తలలో నుంచి వచ్చిన వృక్షమని ఆలా జంబూ మునికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణం.

Jambukeswaram Temple

ఇలా పార్వతీదేవి జంబూ ద్విపాన్ని చేరి కావేరీతీరన తపస్సు చేసి చేతిలో నీటిని తీసుకోగా అదిఒక లింగరూపంలోకి మారగా అప్పుడు వెంటనే శివుడి శక్తి అందులో ఐక్యం అయింది. ఇక జంబూ ఋషి విషయానికి వస్తే, ఈ ముని పూర్వం రోజు కైలాసం వెళ్లి శివుడిని దర్శనం చేసుకొని వస్తుండేవాడు. ఒకసారి ఆ ముని బాగా పండిన నేరేడు పండుని తీసుకువెళ్లి శివుడికి ఇవ్వడగా ఆ స్వామి దానిని తిని అందులోనుండి గింజలను బయటకి ఉమ్మివేయగా, ఆ ముని అదే ప్రసాదంగా భావించి ఆ గింజను తినడంతో అతడి తలనుండి ఆ వృక్షం మొలిచింది. అప్పుడు శివుడి ని ప్రార్ధించి దీనికి పరిష్కారం చెప్పని ఆ ముని వేడుకొనగా, శివుడు కావేరినది తీరాన జంబూ వృక్షాలు ఉన్న ప్రాంతంలోకి వేళ్ళు త్వరలోనే నీకు మోక్షం లభిస్తుందని చెప్పాడట.

Jambukeswaram Temple

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న శివలింగం పానవట్టం నుండి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. ఇందుకు సాక్ష్యంగా లింగం పానవట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఆ తరువాత తీసేసి వస్త్రాన్ని పిండితే అందులో నుండి నీరు వస్తుంది. ఇక్కడ వెలసిన అమ్మవారిని అఖిలాండేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు. ఆ అమ్మవారు చతుర్భుజాలతో నిలుచున్న భంగిమలో ప్రతిష్టించబడి ఉన్నారు.

Jambukeswaram Temple

జగద్గురు ఆదిశంకరులవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఇలా ఎంతో ప్రాచీన ఆలయమైన ఇక్కడ పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం ఉండటం, సాక్షాత్తు శివుడే సిద్ధుడి రూపంలో వచ్చి ఒక ప్రాకారాన్ని నిర్మించడం విశేషం కాగా ఇంతటి విశేషం ఉన్న జలలింగం దర్శనం ఇచ్చే ఈ ఆలయానికి ఎప్పుడు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,470,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR