Home Unknown facts pandavula manumadu prathistinchina shivalingam ekkada undho telusa

pandavula manumadu prathistinchina shivalingam ekkada undho telusa

0

రామాయణం లో రాముడు రావణుడిని సంహరించి బ్రహ్మహత్యా పాతకం కలిగినందుకు దేశంలో చాలా చోట్ల శివలింగాలని ప్రతిష్టించాడని తెలుసు, అదేవిధంగా మహాభారతంలో పాండవులు కూడా అదేవిధంగా కొన్ని చోట్లా శివలింగాలను ప్రతిష్టించారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ ఆలయంలో మాత్రం శివలింగాన్ని పాండవుల మనుమడు శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.pandavula manumadu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణానికి 8 కీ.మీ. దూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో శ్రీ రామలింగేశ్వరాలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో పాండవుల మనుమడు జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ తరువాత కాలంలో చాళుక్యుల రాజులచే ఆలయ నిర్మాణం జరిగింది. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం ప్రాచీనతో బాటు విశిష్టత చాటుకుంటూ ఉన్న గొప్ప ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది.

ఈ దేవాలయం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయ వాస్తు శిల్పకళ మహానంది ఆలయాన్ని పోలి ఉంటుంది. అయితే మహానంది ఆలయాన్ని కూడా చాళుక్యులు నిర్మించారు. ఇక్కడ చాళుక్యులచే నిర్మించబడిన భీమలింగేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. వీటిని జాతీయ వారసత్వ సంపదగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఆలయంలోని గర్భగుడి గోడలకు ఉణ్హన గుళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్బవమూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. ఇక గర్భగుడి మధ్యలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. ఇక్కడ శిఖరం పైన ఉన్న కలశం భక్తులను కనువిందు చేస్తుంది. ఇంకా ఈ ఆలయంలో నటరాజ విగ్రహం కూడా ఉంది.

ఈ ఆలయ ప్రాంగణంలోనే మొత్తం ఆరు దేవాలయాలున్నాయి. వాటిలో అన్నిటికంటే భీమలింగేశ్వరస్వామి ఆలయం పెద్దదిగా చెబుతారు. ఇలా ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా వెలసిన ఈ ఆలయానికి శివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version