Papikondallo Godavari nadhi Odduna Rahasya Shivalingam

పంచ‌శైవ‌క్షేత్రాల్లో ఒక‌టిగా ప్ర‌సిద్ధికెక్కిన ప‌ట్టిసాచ‌ల‌ క్షేత్రం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తోంది. ప‌విత్ర గోదావ‌ర‌రి న‌దిలో పుణ్య‌స్నానాలు చేసి శివాల‌యంలో పూజ‌లు జ‌రిపితే మోక్షం ల‌భిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. మరి వీరభద్రుడు అక్కడ ఎలా వెలిసాడు? ఆ పర్వతం ఎక్కడ ఉందనే మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. Papikondalloఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో అఖండ గోదావ‌రి న‌ది మ‌ధ్య‌లో ఈ శైవ‌క్షేత్రం వెల‌సింది. ప‌విత్ర గోదావ‌రి న‌ది మ‌ధ్య స‌హ‌జ సిద్ధంగా వెల‌సింద‌ని భావించే చ‌రిత్ర ప్ర‌సిద్ధి గాంచిన ఈ శైవ‌క్షేత్రాన్నిప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రంగా భ‌క్తులు పేర్కొంటారు. ఇక్కడే పాపికొండల మధ్య పారే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపై వీరభద్రస్వామి ఆలయం ఉన్నదీ. Papikondalloఈ ఆలయంలోని పరమశివుడికి అభిముఖంగా అద్భుతమైన నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని గోడలు వివిధ రకాల నృత్యాల చిత్రపటాలతో అలంకరించి ఉంటుంది. ఇంకా గౌతమ బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చి ధ్యానం చేశాడని చరిత్ర చెబుతోంది. ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తారు. Papikondallo

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవట. అలా ఆకాశంలో ఎగురుతూ, సేద తీరేందుకు ఓ చోట ఆగేవట. సేదదీరేందుకు అవి భూమిపై దిగే సమయంలో అక్కడ ఉన్న జనజీవనం మొత్తం నాశనమయిపోయేది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు ఆ పర్వతాల రెక్కలను ఖండించాడు. దీంతో ఆ పర్వతాలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పర్వతాలనే దేవ కూటాద్రి పర్వతాలు లేక నీలాద్రి పర్వతాలు అని పిలుస్తుంటారు. Papikondalloదేవకూటాద్రి పర్వతం పర్వత రాజైన కరవీర కుమారుడు. కాగా, ఈ కరవీరుడు కైలాసనాథుని కోసం కఠినంగా తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడితో లింగాకారంలో తనపై నివాసం ఉండాలని వరం కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు శివుడు కొండపై నివాసముండేందుకు అంగీకరించాడు. కొంత కాలం గడిచిన తర్వాత, శివుని భార్య సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యాగానికి అందరు దేవతలు హాజరయ్యారు. పరమశివుడు, అతని భార్యను మాత్రం పిలువలేదు. ఈ అవమానాన్ని సహించలేని సతీదేవి తండ్రిని నిలదీసేందుకు యాగశాలకు వెళ్లింది. Papikondalloఅక్కడ సతీదేవి తండ్రి శివుని గురించి దుర్భాషలాడటంతో ఆమె ఆ అవమాన భారాన్ని మోయలేక అగ్నికి ఆహుతయింది. దీంతో కోపోద్రిక్తుడైన పరమశివుడు తన తలలోని జటాజూటంలోంచి వీరభద్రుడిని పుట్టించాడు. అప్పుడు వీరబద్రుడు ప‌ట్టిసం అనే ఆయుధంతో ద‌క్ష ప్ర‌జాప‌తి శిర‌స్సు ఖండించి దేవ‌కూట ప‌ర్వ‌తంపై విల‌య‌తాండ‌వం చేశాడు. ఆయ‌న‌ను శాంతించ‌మ‌ని ముక్కోటి దేవ‌త‌లు వేడుకోగా లింగాకారంలో స్వ‌యంభువుగా కొండ‌పై వెల‌సిన‌ట్టు స్కంధ‌పురాణంలో పేర్కొన్నారు.Papikondalloఅయితే శివుడు తాండ‌వం చేస్తుంటే భూమి అదిరింద‌ని, ఆ భ‌ద్ర‌గుండం నుంచి భ‌ద్ర‌కాళి ఉద్భ‌వించిన‌ట్టు క‌థ‌లున్నాయి. ఆగ‌స్త్యుని కోరిక మేర‌కు శివుడు లింగాకారంలోకి మారి అవ‌త‌రించిన‌ట్ట‌గా లింగాకారం చుట్టూ బాహువులు అంటే ఆగ‌స్త్యుని చేతి గుర్తులు ఇప్ప‌టికీ చూడ‌వ‌చ్చు. Papikondalloఈ దేవ‌కూటానికి స‌మీపంలో శ్రీ‌మ‌హావిష్ణువు గ‌జేంద్రునికి మోక్షం ప్ర‌సాదించిన ప్ర‌దేశం ఉంది. ఏనుగు శిల‌గా మారినందువ‌ల్ల ఆ కొండ‌ను ఏనుగు కొండ‌గా కూడా పిలుస్తారు. Papikondalloఇలా పట్టిసీమ వీరభద్రుడు దేవకూటాద్రి పర్వతం పైన వెలసి భక్తుల పూజలనందుకొంటున్నాడు. అప్పట్నుంచీ ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతంగానే కాకుండా చక్కని పర్యాటక ప్రాంతంగా కూడా విరాజిల్లుతోంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR