పరశురాముడు ఇప్పటికి చిరంజీవి గా ఉన్నాడని చెప్పే ఆ గిరులు ఎక్కడ ఉన్నాయి?

0
11913

శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఆరొవ అవతారమే పరశురామావతారం. అయితే దుర్మర్గులు అయినా క్షత్రియులని సంహరించడానికి శ్రీమహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు. ఇక సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మరియు రేణుకా మాత కుమారునిగా పరశురాముడు జన్మించాడు. తన తండ్రి జమదగ్ని నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొందినవాడు కనుకనే ఆయనని పరశురాముడు అని పిలుస్తారు.

పరశురాముడు ఇంకా పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. అయితే పరశురాముడు చిరజీవుల్లో ఒకడిగా ప్రసిద్ధుడు. అయితే ఈ గిరులలా లోనే పరశురాముడు ఇప్పటికి చిరంజీవి గా ఉన్నాడని చెబుతారు. మరి ఆ గిరులు ఎక్కడ ఉన్నాయి? అక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పరశురాముడుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, మందస మండలం నుండి 70 కి.మీ. దూరంలో ఒరిస్సా రాష్ట్రంలోని జరంలో ఉన్న గిరిజన గ్రామానికి దగ్గరలో మహేంద్రగిరులు ఉన్నాయి. ఇక్కడే పరశురాముడు ఇప్పటికి నివాసం ఉంటున్నాడని చెబుతారు. ఈ మహేంద్రగిరులు దక్షిణ భారతదేశంలో ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దులలో ఉన్నాయి.

పరశురాముడుఅతి ఎత్తైన పర్వతశ్రేణులుగా పిలువబడే తూర్పు కనుమల నడుమనున్న గిరులే ఉమా మహేంద్రగిరులు. ఇవి 1600 అడుగులు అని చెబుతారు. అయితే సత్యయుగంలో పరమేశ్వరుడు చేసిన గోహత్య పాపం నుండి పరిహారం చేసుకోవడానికి ఈ మహేంద్రగిరుల్లో తపస్సు చేసినట్లు శివపురాణం చెబుతుంది. ఇంకా హనుమంతుడు సీతాదేవి జాడకోసం ఈ గిరుల నుండే సముద్రాన్ని లఘించినట్లు రామాయణం చెబుతుంది. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడు ఈ గిరులలో ఉన్న పరశురాముని దర్శించినట్లు, పాండవులు, తమ వనవాసంలో ఈ ప్రాంతంలోనే అవసమేర్పరుచుకున్నట్లు ఇక్కడ ఉన్న నిర్మాణాల ద్వారా తెలియుచున్నది.

పరశురాముడుఈ గిరులలో, పాండవ గృహాలు, దేవాయజ్ఞశాల, ధారుబ్రహ్మ, కర్ణుడు ఆవాసం ఉన్న చోటు, అర్జునుడి గుహ, పాండవుల సమావేశ ప్రాంతం, భీమమందిరం, పరశురామకొలను, పరశురామగుండం, సీత పర్వతం ఇలాంటి ఎన్నో నిర్మాణాలు ఈ గిరులలో ఉన్నాయి.

పరశురాముడు