త్వరగా బరువు తగ్గించే పార్స్‌లీ టీ!

ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. అధిక తిండి తినడవం వల్ల వస్తుందో లేక ఇంకేదైనా కారణం ఉండొచ్చు కానీ బరువును మోయలేకపోతున్నారు చాలామంది. ఆబరువును ఎలా తగ్గించుకోవాలో తెలియక కొంతమంది సతమతమౌతున్నారు. కొంతమంది డాక్టర్స్ సలహాతో ముందుకు అడుగుకు వేస్తుంటే మరికొంతమంది మాత్రం డైట్ చేస్తూ బరువును తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నారు.

parsley leafబరువు తగ్గించుకోవడానికి డైట్ ట్రైనర్లు ఎన్నో సూచిస్తారు. చుట్టుపక్కల వాళ్లంతా రకరకాల సలహాలు ఇస్తారు. బరువు ఎక్కువగా ఉండేవారు అన్నింటినీ పాటిస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా ఈ బరువు తగ్గడం అన్నది మాత్రం అంత ఈజీ కాదన్నది ఎక్కువ మంది చెప్పే మాట. అలాగని ప్రయత్నం మానకూడదు. మానితే మరింత బరువు ఎక్కువైపోతూ ఉంటారు.

అయితే బరువు తగ్గించడంలో హెర్బల్ టీల పాత్ర అమోఘమనే చెప్పాలి. గ్రీన్ టీ, చామంతి టీ, మందారం టీ వంటి హెర్బల్ టీలతో బరువుని అదుపులో పెట్టుకోవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతున్నారు. ఆ జాబితాలో చేరిన మరో టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే పార్స్‌లీ టీ. బరువు తగ్గించేందుకు పార్స్‌లీ టీ బాగా ఉపయోగపడుతోందని తాజా పరిశోధనల్లో తేలింది.

fatపార్స్‌లీ ఆకులు కొత్తిమీరలానే ఉంటుంది. కానీ కొతిమీరకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎక్కడబడితే అక్కడ దొరుకదు. పార్స్‌లీ టీ పొడి, పార్స్‌లీ టీ బ్యాగ్స్… సూపర్ మార్కెట్లలో లభిస్తున్నాయి. అమేజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి… ఆ టీ పొడి (టీ బ్యాగ్ కంటే టీ పొడి మేలు) కొనుక్కొని… వాడితే మంచిది.

parsley teaఈ టీ తాగితే… మన శరీరంలో పోషకాలు నష్టపోకుండా వ్యర్థ కొవ్వులు మాత్రమే బయటకు పోతాయి. ఎందుకంటే… పార్స్‌లీ ఆకుల్లో విటమిన్ A, B (ఫోలేట్), C, Kతోపాటూ… ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫార్పరస్, ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ (విష వ్యర్థాల్ని తరిమేసే యాంటీ ఆక్సిడెంట్) వంటివి ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడంలో కూడా పార్స్‌లీ టీ ఉపయోగపడుతోంది.

గ్లూకోజ్‌ లెవెల్స్‌ సరిగా ఉన్నప్పుడు మన శరీర బరువు కూడా పద్ధతిగా ఉంటుంది. అప్పుడు లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తూ మనం ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల తీపి జ్యూస్‌లు, డ్రింకులు, పానీయాలు తాగేబదులు.. పార్స్‌లీ టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి ఇన్ని తెలుసుకున్నప్పుడు ఆ టీ ఎలా తయారుచేసుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా..

digestive systemఓ కప్పు నీటిలో (200ML) పార్స్‌లీ టీ పొడి వెయ్యాలి. ఓ ఐదు నిమిషాలు సిమ్ లో మరగనివ్వాలి. ఆ తర్వాత ఫిల్టర్ చెయ్యాలి. ఆ పార్స్‌లీ టీ నీరులో… తీపి కోసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ టీని రోజూ రెండుసార్లు తాగుతూ ఉంటే… బయటకు తెలియకుండా… లోలోపల మన శరీరంలో చెడు కొవ్వు అలా అలా కరిగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులకే మనం బరువు తగ్గగలం అని పరిశోధకులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR