ఒకే రాతితో భూమిలోపల ఏర్పడ్డ శివుడి గుహ

మన దేశంలో ఎన్నో అద్భుత శివాలయాలు అనేవి ఉన్నవి. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఈ శివాలయం ఒకే రాతితో భూమిలోపల నిర్మించబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం, ఇక్కడ ఉన్న నందిమంటపం ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఈ శివాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

pathaleshwaa mahadevపూణే లో పాతాళేశ్వర్ గుహాలయం ఉంది. ఇక్కడ భూగర్భంలో శివుడు కొలువై ఉండగా, ఇక్కడ ఇలా వెలసిన శివుడికి పాతాళేశ్వర్ మహాదేవ్ అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న నందిమంటపం ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇంకా ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఈ గుహాలయం ఏకరాతి నిర్మాణం అని చెబుతారు.

pathaleshwaa mahadevఈ ఆలయం 8 వ శతాబ్దానికి చెందినది అని చెబుతుండగా, పూర్వం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆలయాన్ని కొన్ని గంటల్లో నిర్మించి ఇక్కడే కొన్ని రోజులు శివుడికి పూజలు చేసారని స్థల పురాణం.

pathaleshwaa mahadevఇక ఎంతో అందంగా నిర్మించిన ఈ గుహాలయం భక్తులకి విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ సీతారామలక్ష్మణులు, గణపతి, లక్ష్మి దేవి కి విడిగా కొన్ని ఆలయాలు అనేవి ఉన్నవి. ఇక్కడ ఉన్న ఈ గుహాలయం ఎల్లోరా రాతి గుహాలని పోలి ఉండటం విశేషం. ఈవిధంగా ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా భూగర్భంలో దర్శనమిచ్చే పాతాళేశ్వర్ మహాదేవ్ అని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR