తేళ్లని దేవుళ్లుగా భావించే వింత ఆచారం ఎక్కడ ఉంది ?

0
1351

హిందూసాంప్రదాయంలో దేవుళ్లనే కాకుండా ఆవు, పాము వంటి వాటిని కూడా దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ గ్రామంలోని వారు తెళ్లని దేవుళ్లుగా భావించి గ్రామంలోని వారందరు కలసి తేళ్ల పండగ చేసుకుంటారు. మరి ఈ వింత ఆచారం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Scorpions Are Worshipped As God

తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో, మహబూబ్ నగర్, నారాయణపేట దగ్గరలో ఉన్న కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమయి దేవత ఆలయం ఉంది. ఇక్కడి గ్రామస్థులు తెళ్లని దేవతగా భావిస్తూ కొండమయి దేవత గా కొలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది.

Scorpions Are Worshipped As God

ఇంకా నాగుల పంచమి రోజున పాము కి పూజలు చేయకుండా ఈ గ్రామంలోని ప్రజలు ఆ రోజున ఆలయం ఉన్న గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న ప్రతి రాయిని కదిలించగా రాయి కిందనుండి తేళ్లు వస్తుంటాయి. ఆలా వచ్చిన ఆ తెళ్లని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా విషపూరితమైన తెళ్లని వారు చేతులతో పట్టుకొని తేళ్ల ఉత్సవంలో పాల్గొంటారు. ఈవిధంగా తెళ్లని పట్టుకున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా తేలు కరిచినప్పటికీ ఆలయంలో ఉన్న కుంకుమ పెడితే నయం అవుతుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ తేళ్ల ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం ఒకే రోజు అది కూడా నాగులపంచమి రోజున మాత్రమే నిర్వహిస్తారు.

Scorpions Are Worshipped As God

ఈవిధంగా ఇక్కడ జరిగే తేళ్ల ఉత్సవంలో ఈ గ్రామంలోనే వారు కాకుండా చుట్టూ పక్కల ప్రాంతాలలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇలా నాగులపంచమి రోజున ఈ ఆలయానికి వచ్చి తేళ్ల దేవతని దర్శించి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం.