ఆడవాళ్ళలో పీరియడ్స్ ఇరెగ్యులర్ గా రావడానికి చాల కారణాలు ఉంటాయి. కొంతమందికి హార్మోన్స్ ప్రాబ్లమ్, ఇంకొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్, మరికొందరికి ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు కారణంగా ఉంటుంది. అయితే ఇలాంటి వారిని పరీక్షించినప్పుడు మందులతో చికిత్స సూచిస్తారు నిపుణులు. మందులు వాడినప్పుడు వారికి సమస్య తగ్గుతుంది. కొంతమందిలో మందులు వాడిన సమయంలో మాత్రమే పీరియడ్స్ వస్తుంది. ఇలాంటి వారు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
ఏఎమ్‌హెచ్ తక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇలాంటి వారికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ కండీషన్‌ని ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అని అంటారు. ఇలాంటి వారు పిల్లల గురించి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు కానీ త్వరగా పిల్లలు పుట్టరు. ఇది సాధారణంగా ఆడవారి సమస్య. వీరిని పెళ్లి చేసుకున్న మగవారిలోనూ సమస్య ఉంటే ఇక పిల్లలు పుట్టడం కష్టమే.
ప్రీ మెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్‌కి కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఈ సమస్య ఎక్కువగా జన్యు పరంగా రావడం చూస్తూ ఉంటాం. ఈ సమస్యలు ఉన్నవారికి గర్భధారణ అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారికి ఐవీఎఫ్ సూచిస్తారు వైద్యులు.
ఈ పద్ధతిలో దాతల నుంచి అండాలను సేకరించి అది పిల్లలు కావాలనుకున్న భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి దాన్ని ఆ భార్య గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇలాంటి వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం తరచుగా వ్యాయామం చేయడం, కాల్షియం, విటమిన్ డి ఆహారాన్ని తీసుకోవడం చేయాలి.