హిందూపురాణాలలో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా, శ్రీ మహావిష్ణువు సర్ప రాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు. ప్రతి సంవచరం నాగులచవితి నాడు భక్తులు నాగుపాముని పూజించి వారి భక్తిని చాటుకుంటారు. అయితే నాగుపాము గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు అనేవి ఉన్నాయి. మరి ఆ విషేయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నాగుపాములకు కళ్లు కనిపించవనే అపోహ ఒకటి ఉంది. కానీ వాటికి పగలే కాదు రాత్రిపూట కూడా కళ్లు చాలా చక్కగా కనిపిస్తాయి. దానికితోడు వాటికి అద్భుతమైన ఘ్రాణ శక్తి కూడా ఉంటుంది. అంటే వివిధ వాసనలను బట్టి కూడా పరిసరాల్లో ఏమేం ఉన్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవు అని చెబుతున్నారు. అంతేగాక, ఉష్టోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి. వీటన్నింటి ఆధారంగా నాగుపాములు రాత్రివేళల్లో తమ ఆహారాన్ని సమర్థంగా వేటాడుతాయని అంటున్నారు. ఇక ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఓ గూడును కట్టే ఏకైక పాములు నాగుపాములే అని తేల్చారు. నాగుపాములు ఏప్రిల్, జూలై నెలల మధ్య గుడ్లు పెదతాయి. ఆడ పాములు 12 నుండి 30 వరకు గుడ్లను బొరియలలో పెడతాయి. ఇంకా అవి 48 నుండి 69 రోజులలో పొదగబడతాయని అప్పుడే పుట్టిన పిల్ల పాములు 8 నుంచి 12 అంగుళాల వరకు ఉంటాయి అంటున్నారు. ఇక అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిగా పనిచేసే విషపు గ్రంథులు ఉంటాయని చెబుతున్నారు.
ఇంకా శత్రుజీవులపైనా గాని, లేదా తాము వేటాడదలచుకున్న జీవులపై గాని, విషాన్ని ఉమ్మగలిగే జీవుల్లో ఆ పనిని కచ్చితంగా చేయగలిగేవి కూడా నాగుపాములే అని చెబుతున్నారు. ఇవి తమ పొడవులో సగం దూరం దాకా, సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకున్నాయో అక్కడే పడేలా దాన్ని వదలగలుగుతాయి. అంతేకాకుండా నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది. ఇక నాగుపాములు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు.