Prasna sastram ante yemito thelusa?

0
4256

అప్పటి వరకు విజయాలు సాధిస్తూ సంతోషంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా సమస్యల వలయంలో   చిక్కుకున్నాడంటే.. దాని వెనుక క్షుద్ర ప్రయోగాల ప్రభావం ఉందని అనుమానించాలి. క్షుద్ర ప్రయోగాలు జరిగినప్పుడే వ్యక్తి జీవితం ఊహించని కల్లోలాల్లో పడుతుంది. క్షుద్ర ప్రయోగాలనే తెలుగులో చేతబడి, చిల్లంగి, బాణామతి అని పిలుస్తారు. అదే మలయాళ మాంత్రికులు చేతన్, కుట్టి చేతన్ అని అంటారు. అటువంటి ప్రయోగాలు మనపై ఎవరైనా ప్రయోగించారా? లేదా ? అని తెలుసుకునేదే.. ప్రశ్న శాస్త్రం. క్షుద్ర శక్తుల్ని తట్టుకొని నిలబడగల ధైర్యవంతులు, జ్యోతిష శాస్త్రం తెలిసినవారు మాత్రమే ఈ ప్రశ్న శాస్త్రం జోలికి వెళ్ళగలరు. వారే చేతబడి రహస్యాన్ని బయటపెట్టగలరు.1 Question Sastarm

కేరళ మాంత్రికులు క్షుద్ర ప్రయోగాలను కనుగొనే విధానం విభిన్నంగా ఉంటుంది. మాంత్రికుడు తాంత్రిక మంత్రాలూ పాటిస్తూ ఒక ప్రశ్న చక్రాన్ని గీస్తాడు. ఆ తర్వాత లగ్నాన్ని నిర్ణయించి ఆపై ఆ సాయంలో అంతరిక్షములో సంచరిస్తున్న వివిధ గ్రహాలూ ఏ ఏ రాశులలో ఉన్నాయో తెలుసుకొని వాటిని రాశి చక్రంలోని ఆయా స్థానాలలో లిఖిస్తాడు. ఆపై ప్రశ్న చక్రం ఆధారంగా క్షుద్రశక్తులు ప్రయోగించారా? లేదా? స్పష్టం చేస్తారు.5 Question Sastarm