తులసి ఆకులను తుంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి… లేకపోతే తులసి చెట్టు పూజకు పనికిరాదు!

పురాతన కాలం నుండి తులసిని దైవంగా, పవిత్రంగా భావిస్తున్నాం. పురాణాల్లో కూడా తులసి విశిష్టత తెలిపే ఎన్నో కథలు ఉన్నాయి. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం.

basil plantతులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. అందుకే తులసిని ఎన్నో వ్యాధుల నియంత్రణలో ఉపయోగిస్తుంటారు. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.

basil leafముదురు రంగులో ఉండే తులసి జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

basil leafతులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు. ఇంటి ముంగిట్లో తులసి చెట్టు ఉంటే ఇంట్లో సమస్యలు తోలగిపోతాయని చెబుతుంటారు. తులసి మొక్కతో హారి పూజిస్తారు. అలాగే కొంతమంది ఈ తులసి ఆకులను టీలో వేసుకోని తాగుతుంటారు. అయితే ఈ తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచకూడదు.. దాని వల్ల కలిగే పరిణామాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

basil juiceతులసి మొక్క ఆకులను ఆదివారం, సూర్యగ్రహణం, అయనాంతం, ద్వాదశి, చంద్రగ్రహణం, సాయంత్రం పూట, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచకూడదు. అలాగే తులసి ఆకులను తూర్పు ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి. ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తుంచకూడదు. అలాగే రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా.. కాళ్ళకు చెప్పులు వేసుకొని తులసి మొక్కను తాకకూడదు. తులసి ఆకును ఒకటిగా తుంచకూడదు.. మూడు ఆకులను కలిపి ఒకేసారి తుంచాలి.

plucking tulasiతులసి ఆకులను గోరుతో తుంచడం కానీ, లాగడం కానీ చేయకూడదు. అలాగే వాటిని నోటిలో వేసుకోని నమలకూడదు. తులసి మొక్కను ఈశాన్యాన గాని తూర్పు పక్కన గాని నాటాలి . అటు వైపు సూర్యుడి వెలుగు ఎక్కువ ఉండాలి. తులసి చెట్టును రాధారాణి అవతారంగా కోలుస్తుంటారు. అందుకే స్నానం చేయకుండా తులసి చెట్టును తాకకూడదు. అలా చేస్తే ఆ తులసి చెట్టు పూజించడానికి పనికిరాదు. సాయంత్రం సమయంలో తులసి ఆకులను తుంచితే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగి.. అనారోగ్య సమస్యల భారీన పడతారని అంటుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR