హనుమాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు!

ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది. ఆంజనేయ స్వామి దేవాలయం ఉండని గ్రామం అంటూ ఉండదు. మనం ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మనకు వాయుపుత్రుడి దర్శనం కలుగుతుంది.

circling around hanumanఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ, భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు. బలానికి, ధైర్యానికి ప్రతీక గా ఆంజనేయస్వామిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం…

రామాయణం గురించి చెబితే ఆంజనేయుని పాత్ర ఎంతో ఉంది. అందుకే ప్రతి రామాలయంలోనూ ఆంజనేయుని దర్శనం మనకు కలుగుతుంది.
అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు. శ్రీరాముని దాసునిగా, రామ భక్తునిగా, భక్తులు కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామిని దర్శించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

hanuman and lord sri ramaహనుమంతుడు, ఆంజనేయుడు, బజరంగబలి, వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కచ్చితంగా కొన్ని ఆచారాలను పాటించాలి. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కేవలం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి.

పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు ‘శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’అని చదువుతూ ప్రదక్షణలు చేయడం ఎంతో మంచిది.

lord sri rama and hanuman and lakshmanసకల రోగ, భూతప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఒకే రోజు 108 చేయటం కుదరని నేపథ్యంలో 54, 27 పర్యాయాలు చేసినా మంచిదే.

anjani devi and hanumanఅయితే, లెక్క తప్పకుండా చేయాలి. చాలామంది ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరిస్తారు. పొరపాటున కూడా స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచి వేశాడు.

కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించకూడదు. అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతులమీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు.
మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామిని తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాగకూడదని పండితులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR