కరోనా సమయంలో బయటికి వేళ్ళని వారు కూడా తెసుకోవాల్సిన జాగ్రత్తలు

మన దేశంలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఈ మహమ్మారి రోజూ వేలల్లో మనుషుల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ రోజుకూ కొందరు ఫేస్ మాస్క్‌ను లైట్ తీసుకుంటున్నారు. కరోనా వచ్చేదుంటే మాస్క్ పెట్టుకున్నా వస్తుంది, మాస్క్ పెట్టుకోకపోయినా వస్తుందంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు వాళ్లు చిక్కుల్లో పడిందే కాకుండా కుటుంబాన్ని కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకు గురిచేస్తున్న ఈ తరుణంలో ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిన సమయం వచ్చేసింది.

Coronaఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, కుటుంబాలకు కుటుంబాలనే చుట్టేస్తుండటంతో ఇంట్లో కూడా మాస్కులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. మనది జనాభా ఎక్కువగా ఉన్న దేశం. చాలా నగరాల్లో కుటుంబాలు ఓకే ఇంట్లో లేదంటే ఒకే గదిలో కలిసి ఉంటుంటాయి. అలాంటి వారు ఈసారి త్వరగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఇంట్లో ఎవరికైనా వైరస్ సోకినా, లేదంటే జనం ఎక్కువగా తిరుగాడే ప్రాంతం, అపార్ట్‌మెంట్‌లాంటి వాటిలో ఉన్నప్పుడు ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుని ఉండటం మంచిదని వారు సూచిస్తున్నారు.

Coronaఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లకపోతే మంచిదే. కానీ ఎవరైనా బయటకు వెళ్లి వచ్చే వాళ్లుంటే, వారు ఇన్‌ఫెక్షన్‌ను మోసుకొచ్చే అవకాశం ఉంటుంది. వారిలో లక్షణాలు లేకపోవచ్చు. కానీ వైరస్ ఇంట్లోని మిగిలిన వారికి సోకుతుంది. అస్సలు బయటకు వెళ్లని వారు, ఇతర వ్యక్తులతో సంబంధాలు లేని వారైతే ఇళ్లలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. కానీ సాధారణంగా ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి సామాన్ల కోసం బయటకు వెళ్లాల్సి రావచ్చు. వారి వలన ఇంట్లోని పిల్లలకు, వృద్ధులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాస్క్ ధరించడమే మంచిదన్నది నిపుణుల సూచన.

Coronaఇంట్లో కూడా మాస్క్ ధరించాలని చెప్పినప్పుడు, అందరిలో కలిగే సాధారణ సందేహం… వైరస్ గాలిలో తిరుగుతూ ఉంటుందా? కిటికీలు, తలుపులు, వెంటిలేటర్ల ద్వారా ఇంట్లోకి వచ్చి వైరస్ మనుషులకు సోకుతుందా? అని. అయితే అది నిత్యం గాలిలో జీవించి ఉండకపోయినా, గాలి ద్వారా వ్యాప్తి చెందడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Coronaరద్దీగా ఉండే ప్రదేశాలు, అపార్ట్‌మెంట్లలో ఉండేవారు, ఇంట్లో ఎక్కువమంది తిరిగే పరిస్థితులు ఉంటే నిత్యం మాస్క్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అది గాలిలో చక్కర్లు కొడుతూ వ్యాప్తి చెందుతోంది. అంటే మన చుట్టూ ఉన్న గాలిలో వైరస్ ఉంది. వైరస్ సోకిన వ్యక్తి ఎక్కువ సేపు మూసిఉన్న గదిలో ఉంటే అతని శ్వాస నుంచి వచ్చిన అణువులు గాలిలో చేరతాయి. వాటిని పీల్చినప్పుడు మనకు కూడా వైరస్ రావచ్చు. వెంటిలేషన్ ఎక్కువగా ఉండటం వల్ల గాలిలోని ఈ అణువులు త్వరగా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

Coronaకుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగిలిన వాళ్లు మాస్క్ ధరించాలనడం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరికీ వైరస్ లేకపోయినా ఇంట్లో కూడా ముక్కు, నోరు కవర్ చేసుకోవాల్సి రావడం అవసరమేనా? ఇన్ని నుంచి బయటికి రాకున్నా కరోనా ఎలా సోకుతోంది? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి…వైరస్ సోకిన వారు ఎవరైనా ఇంటికి రావడం వల్ల కావచ్చు. రెండోది…మనతో ఉన్నవారిలో లక్షణాలు లేని పాజిటివ్ కేసులు ఉండొచ్చు. వైరస్ ఉన్న విషయం వారికి తెలియదు, వారిని ఇబ్బంది పెట్టదు. కానీ ఇతరులకు మాత్రం వ్యాపిస్తుంది.

Coronaఇంట్లో కూడా మాస్కు ధరించడం చాలా కష్టమైన విషయం. 24 గంటలూ మాస్క్‌ ధరించి ఎలా ఉండగలమని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ధృష్ట్యా రాత్రి నిద్రించే సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఇంట్లో ఉన్నంత సేపు మాస్క్‌లు ధరించాలని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ, గదిలో ఒంటరిగా ఉంటే మాస్క్ అవసరం లేదని, కానీ అలంటి వారు అప్పుడప్పుడు చేతులు కడుక్కోవడం మంచిదని నిపుణులు చెప్పారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR