కరోనా వాక్సిన్ వేసుకున్న తరువాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కొత్త వేరియంట్లతో మరింత ప్రభావవంతంగా రాబోతున్న మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేశారు. జ‌నాలు కూడా కొవిడ్‌-19 బారిన ప‌డొద్ద‌ని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

కరోనా వాక్సిన్అయితే ఇప్పటికీ చాలామందిలో వ్యాక్సిన్ లకు సంబంధించి ఏవేవో అనుమానాలు ఉన్నాయి. టీకా వేయించుకుంటే జ్వరాలు వస్తున్నాయని, ఒళ్ళు నొప్పులు ఇంకా కొన్ని దుష్ప్ర‌భావాలు కూడా వస్తాయనే అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కొంతమంది చనిపోయారని భయంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావట్లేదు.

కరోనా వాక్సిన్ఇంకా కొంద‌రిలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి ఆహారం తినాలి ? కొవిడ్‌-19 టీకా తీసుకున్న త‌ర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? ఏం తిన‌కూడ‌ద‌ని సందేహాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆహార నియ‌మాల‌ను పాటిస్తే వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వాక్సిన్వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామందిలో అల‌స‌ట‌, నీరసం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి ఈ దుష్ప్ర‌భావాల నుంచి బ‌య‌ట ప‌డాలంటే శ‌రీరానికి శ‌క్తినిచ్చే, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే స‌మ‌తుల్య ఆహారం తీసుకోవ‌డం మంచిది. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం

కరోనా వాక్సిన్ఎలాంటి వ్యాధినైనా తరిమేసే సర్వరోగ నివారిణి నీరు. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అందుకే కొవిడ్‌ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు, వేసుకున్న తరువాత ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. సాధారణ నీటిని ఎక్కువగా తాగలేకపోతే వాటిలో నచ్చిన ఫ్లేవర్స్ కలుపుకొని ఇంఫ్యూస్డ్ వాటర్ తాగొచ్చు. నీటిలో కాస్త గ్లూకోస్ కలుపుకొని తగ్గినా శరీరానికి కావాల్సిన శక్తి ఇస్తుంది.

కరోనా వాక్సిన్వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొంతమందిలో నీరసం రావొచ్చు. అలాంటప్పుడు నీటిని ఎక్కువ‌గా తాగ‌డంతో పాటు నీటి శాతం ఎక్కువ‌గా ఉన్న పండ్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని నీటి స్థాయులు పెరుగుతాయి. త‌ద్వారా నీర‌సం త‌గ్గి పున‌రుత్తేజం కావ‌డంతో పాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు కూడా మెరుగ‌వుతుంది. ఫ‌లితంగా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. కరోనా రాకుండా ఉండాలంటే ఇమ్మ్యూనిటీ పెంచుకోవడం ముఖ్యమని, దానికోసం మంచి ఆహరం తీసుకోవాలని అందరికీ తెలిసిందే. అలాగే కరోనా స‌మ‌యంలో కూడా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత కూడా కొంత కాలం రోగనిరోధక శక్తి పెంచే ఆహరం ఎక్కువగా తీసుకోవాలి.

కరోనా వాక్సిన్అదే ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటే అందులో ఉండే అధిక క్యాల‌రీలు, సంతృప్త‌ కొవ్వులు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపిస్తుంది. త‌ద్వారా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ను త‌ట్టుకునే శ‌క్తి క్షీణిస్తుంది. అందుకే ప్రాసెస్‌డ్ ఫుడ్ కి బ‌దులు అధిక ఫైబ‌ర్ ఉండే గోధుమ‌ల‌ను, పండ్లను ఆహారంగా తీసుకోవ‌డం మంచిది. అలాగే కొవ్వులు, చ‌క్కెర‌స్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే చ‌క్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీంతో నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌.. స‌రైన విశ్రాంతి ఉండ‌దు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, తీసుకున్న త‌ర్వాత‌ విశ్రాంతి చాలా అవ‌స‌రం. ఎంత ఎక్కువ నిద్ర‌పోతే అంత చురుగ్గా ఉంటాం.

కరోనా వాక్సిన్ఆల్క‌హాల్ సేవించే వారు టీకా తీసుకోవ‌డానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్న త‌ర్వాత కొన్ని రోజుల వ‌ర‌కు మందు తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే టీకా తీసుకున్న త‌ర్వాత శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆల్క‌హాల్‌ డ్రింక్ చేస్తే శ‌రీరం తొంద‌ర‌గా డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. దీనివ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుంది. ఇమ్యూనిటీ త‌గ్గిపోతే.. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనే శ‌క్తి త‌గ్గిపోతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR