కరోనా సమయంలో డయబెటిస్ పేషేంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కరోనా మహమ్మారి చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటోంది. నిమోనియా, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చనిపోతున్నవారిలో ఎక్కువ మంది ఈ అనారోగ్యాలు ఉన్నవారే ఉన్నారు. ఇందుకు కారణం ఈ అనారోగ్యాలు ఉన్నవారికి సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అందుకే వారిలో కరోనా వైరస్ త్వరగా పెరుగుతోంది. ఈజీగా కంట్రోల్ కావట్లేదు. ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల షుగర్ వ్యాధి డయాబెటిస్ మనల్ని బానిసను చేసుకుంటోంది.

కరోనాడయాబెటిస్ ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుంది. దాంతో నిత్యపోరాటం తప్పదు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ మాటిమాటికీ మారిపోతూ ఉంటే వారిలో పోషకాలు సరిగా శరీరానికి చేరవు. ఇప్పుడు కరోనా ప్రబలే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన వారు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

కరోనాడయాబెటిస్ ఉన్నవారికి కరోనా సోకితే… జ్వరం వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. డయాబెటిస్ కంట్రోల్ తప్పుతుంది. ఇది టైప్-1, టైప్-2 పేషెంట్లందరిలోనూ కనిపిస్తోంది. టైముకి మందులు వేసుకోవడం, ముందుగానే మందులను నెలకు సరిపడా రెడీ చేసుకోవడం మర్చిపోకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కరోనా సోకితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మరిన్ని ఎక్కువసార్లు చెక్ చేసుకోవాలి. శరీరంలో వస్తున్న మార్పుల్ని త్వరగా గుర్తించాలి. ముందుగానే రోగాన్ని గుర్తిస్తే త్వరగా ట్రీట్‌మెంట్ పొందే వీలుంటుంది. ఒకవేళ షుగర్ లెవల్స్ పెరిగితే డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయొద్దు. అలా చేస్తే కరోనా సోకి నిమోనియా, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటోంది.

కరోనాకరోనా సమయంలో షుగర్ పేషంట్స్ యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వాడకూడదు. ముఖ్యంగా అజిత్రోమైసిన్ లాంటి టాబ్లెట్స్ కి దూరంగా ఉండాలి. అవసరమైనంత మేర డాక్టర్స్ మాత్రమే షుగర్ పేషంట్స్ యాంటీ బయాటిక్స్ అందిస్తారు. కరోనా నుండి కోలుకున్న, కోలుకుంటున్న షుగర్ పేషంట్స్ తాము రోజూ తీసుకునే ఇన్సులిన్ లేదా? షుగర్ టాబ్లెట్స్ ని ఎట్టి పరిస్థితిల్లో ఆపకూడదు. చాలా మంది.. కరోనా కారంణంగా ఇప్పటికే చాల మెడిసిన్స్ తీసుకుంటున్నాము కదా అని.. ఈ షుగర్ మెడిటేషన్ ని మిస్ చేస్తున్నారు. కానీ ఇఅది చాలా ప్రమాదకరం. చేతులకు, కాళ్లకు, ఇతర శరీర భాగాలకు చిన్న చిన్న గాయాలు కూడా కాకుండా చూసుకోవాలి. గాయమై రక్తం వస్తే తగిన స్కిన్ కేర్ కచ్చితంగా తీసుకోవాలి. అశ్రద్ధ చేస్తే ప్రమాదమే.

కరోనాఇలాంటి సమయంలో సరైన సంతులిత ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా సోకినా దాన్ని జయించే ఛాన్స్ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ముందుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం అన్ని పోషకాలు అందే సంపూర్ణ, సమతులాహారం తీసుకోవాలి. రోజుకు మూడు పూటల కాకుండా.. తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తీసుకోవాలి. పండ్లు, రసాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచి నీరు ఎక్కువగా తాగుతూ డీహైడ్రేషన్ సమస్య రాకుండా చేసుకోవాలి. బాగా నిద్రపోవడం, ఎక్సర్‌సైజ్ చెయ్యడం వంటివి మర్చిపోకూడదు. అయితే మరీ ఎక్కువ వ్యాయామాలు చేస్తే కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన శరీరానికి ఆక్సిజన్ స్థాయి మరింత అవసరం అవుతుంది. కాబట్టి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR