పైల్స్‌తో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జీవన శైలిలో మార్పుల వల్ల ప్రస్తుత కాలంలో చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. మలద్వారం లోపల, చుట్టూ వాపువచ్చి పెరిగే కణితులనే పైల్స్, హెమరాయిడ్స్, మొలలు అంటారు. ఇవి రక్తనాళాలు, కండ మొదలైనవాటితోనే ఏర్పడే కణసముదాయాలు. ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి, మలద్వారం బయట కూడా ఇవి పెరగొచ్చు.

పైల్స్‌ఇది తీవ్ర సమస్య కాదు, ఎందుకంటే సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గరి సిరలు పొంగి, వాచి మొలలుగా మారతాయి. ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరో ముఖ్యకారణం, ఆహారపు అలవాట్లు. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకి మూలం మన ఆహారపద్ధతులే.

పైల్స్‌కాబట్టి మొలలను తగ్గించాలంటే దానికి కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి. అందుకు తగ్గ ఆహారాన్నే తీసుకోవాలి. బాగా వేయించిన పదార్థాలు మొలలను మరింత తీవ్రతరం చేస్తాయి. అవి జీర్ణవ్యవస్థను మందగించేలా చేసి,ప్రేగులు సరిగ్గా పనిచేయనివ్వకుండా చేసి, లోపలి వాపులను పెంచుతాయి. దీనివల్ల మరింత చికాకుగా, నొప్పిగా ఉంటుంది. రాత్రి పూట అధికభోజనం, ఎక్కువ కారాలు, మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా రక్తస్రావం ఉన్న పైల్స్ కి అయితే ఇవి భరించలేని బాధని కలిగిస్తాయి. అందుకని కేవలం ఆరోగ్యకరమైన,తేలికైన ఆహరాన్నే తీసుకోవాలి.

పైల్స్‌పైల్స్‌తో బాధపడుతున్న వారు కచ్చితంగా ఫైబర్ ఫుడ్ తినాలని సిఫార్సు వైద్యులు చేస్తున్నారు. ఫైబర్ ఫుడ్ తినడం వల్ల పురీషనాళం చివరలను మృదువుగా చేస్తుంది. తద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడం సులభం చేస్తుంది. నీరు, పండ్ల రసాల రూపంలో చాలా ద్రవాలు తినడం కూడా చాలా ముఖ్యం. ఇక పైల్స్ పరిస్థితిని మరింత దిగజార్చే ఆహారాలు చాలా ఉన్నాయి. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలు మలబద్దకాన్ని పెంచుతాయి, ఇవి పైల్స్ ను ప్రేరేపిస్తాయి.

పైల్స్‌పైల్స్‌ ఉన్నవారు బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్, చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, క్యాబేజీ, గుమ్మడికాయ, గుమ్మడికాయ, బెల్ పెప్పర్స్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలు తరుచుగా తినాలి.

పైల్స్‌పైల్స్, మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ ను తగ్గిస్తుంది. హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.

పైల్స్‌అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినాలి.

పైల్స్‌మొలల సమస్య ఉన్నవారిని రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం మంచిది. అది కూరల్లోనైనా వేసుకోవచ్చు. లేదా గ్లాసు నీటిలోనైనా కలుపుకుని తాగొచ్చు. మన దేశవాళీ వంటదినుసు అయిన ఇంగువకి కొన్ని జబ్బులను నయం చేసే గుణం ఉంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి మొలల సమస్యని కూడా తగ్గిస్తుంది.

పైల్స్‌బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి.పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR