చలి కాలంలో పొడిబారిన చర్మాన్ని ఎలా మృదువుగా మార్చుకోవాలో తెలుసా ?

చలికాలం ప్రారంభమైయింది. కానీ, ఈ కాలంలో సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు పొడిబారిన చర్మాన్ని మరింత దెబ్బతీస్తాయి. మరి ఈ పొడిబారిన చర్మాన్ని ఎలా మృదువుగా, కాంతివంతగా మార్చులో చూద్దాం చలి కాలం వస్తుందంటే సీజనల్ గా వచ్చే రోగాలు వెంటాడుతుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి రోజు కాచి వడబోసిన నీటిని తాగుతుండాలి.

చలికాలంప్రతిరోజు స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించాలి. చలి కాలంలో బయటకు వెళ్లే సమయంలో చర్మం పొడిబారకుండా ముఖానికి గుట్ట కట్టుకోవడం మంచిది.

Hot Waterచలికాలంలో చాల మందికి నోటికి ఇరువైపులా పగుళ్లు ఏర్పడతాయి. నోరు తెరిచే సమయంలో కొంత ఇబ్బందులను కలిగిస్తాయి. అలాంటి వారు ఉదయం, సాయంత్రం సమయంలో వెన్న లేదా నెయ్యి రాసుకోవాలి.

నెయ్యిఇక ఎక్కడెక్కడ పగుళ్లు ఏర్పడుతున్నాయి ఆ ప్రదేశంలో కూడ రాసుకుంటే చర్మంపై పగుళ్లు కనపడకుండా కాంతివంతంగా మెరుస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే సున్ని పిండి, శీకాయతో స్నానం చేయడం మంచిది.

సున్ని పిండిరాత్రి వేళలో పడుకోబోయే ముందు గోరువెచ్చని ఆలివ్ నునె లేదా కొబ్బరి నూనెతో మీకు ఎక్కడైతే పొడిబారుతుందని అనిపిస్తుందో అక్కడ కాస్త రాసుకొని పడుకుంటే పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. చలి కాలంలో పొగ మంచు వలన ప్రమాదాలు జరగకుండా మీరు మీ వాహనాలకు వెనుక, ముందు వైపున రేడియం స్టిక్కర్లను అతికుంచుకుంటే బాగా ఉపయోగం ఉంటుంది.

కొబ్బరి నూనె
గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే ఈ చలికాలం తాగక పోవటం మంచిది. గ్రీన్ టీ కి బదులు అల్లం వేసి కాచిన డికాషన్ తాగటం మంచిది. అంతే కాదు ఈ చలికాలం మొత్తం బాగా వేడి గా వున్న నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి.

గ్రీన్ టీబాడీ కి వాడే సోప్ కాకుండా సున్ని పిండి వాడటం వల్ల చర్మం స్మూత్ గా వుంటుంది. స్నానం అయ్యాక మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి.రాత్రి పడుకునే సమయంలో పెదాలకి లిప్ బామ్ రాయటం వల్ల పెదాలు చిట్లే సమస్య తగ్గుతుంది.

చలికాలం పిల్లల్లో ఆకలి తగ్గిస్తుంది. చిరుతిళ్ళపై పిల్లలకుండే సహజమైన ఆసక్తితో వాటిని తింటారేమోగానీ, నిజమైన పోషక విలువలు గల అసలైన భోజనం మాత్రం వారికి ఇష్టముండదు. తిండి తగ్గిపోవడంతో శరీరం లో శక్తి కూడా సన్నగిల్లుతుంది. రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు తేలిగ్గా దాడిచేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తినేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలం గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అది రకరకాల వైరస్‌ లకు, బాక్టీరియాకి స్థావరమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవ సరంలేదు. శ్వాస ద్వారా చలిగాలులతో పాటు వైరస్, బాక్టీరియా కూడా వచ్చి చేరుతాయి.ఈ విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR