Home Health కరోనా నుండి రికవరీ అయినా తరువాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా నుండి రికవరీ అయినా తరువాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం కరోనా వయసుతో సంబంధం లేకుండా అందిరికి సోకుతుంది. ఇంతకు ముందు కన్నా రెట్టింపు వేగంతో విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ కరోనా సోకిన వారు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం, ఆకస్మాత్తుగా పడిపోవడం, తీవ్ర అలసటగా ఉంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. చాలా మంది కరోనా రోగులు పొడి దగ్గు, బలహీనత వంటి లక్షణాలు ఉంటున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ కరోనా నియమాలను పాటిస్తున్నారు. కరోనా సృష్టిస్తున్న కరోనా కల్లోలం నుంచి తమను తాము రక్షించుకోవడానికి కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Precautions to be taken even after recovery from coronaఇది ఒకెత్తయితే, కరోనా సెకండ్ వేవ్ కి సంబంధించి మరో భయంకరమైన విషయం ఏమిటంటే సెకండ్ వేవ్ కరోనా నుండి రికవరీ అయిన చాలామంది తీవ్ర అలసటను, బలహీనతను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే, ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కానీ 14రోజుల కరోనా పోరాటం తర్వాత నెగెటివ్ వచ్చినప్పటికీ, కరోనా లేకపోయినప్పటికీ బలహీనంగా ఉండడం చూస్తూనే ఉన్నాం. కొన్ని వైరస్‌లు మానవ శరీరంలో మూడు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు.

వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగెటివ్ వస్తే, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే, పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఒక చోట వైరస్‌ ఇంకా దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్నుండి బయటపడడానికి సరైన పోషకాహారం చాలా అవసరం. పోషకాహారంతో పాటు కొన్ని టిప్స్ పాటిస్తే కరోనా తర్వాత వచ్చే బలహీనతను చాలా తొందరగా జయించవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కరోనా నుండి రికవరీ అయ్యి, ఆ తర్వాత వచ్చే అలసట, బలహీనత కారణంగా ఇబ్బందులు పడుతుంటే డైట్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఒక ఖర్జూరం, గుప్పెడు ఎండుద్రాక్ష, రెండు బాదం, రెండు వాల్ నట్స్ అన్నిటినీ రాత్రిపూట నానబెట్టి పొద్దున్న పూట తినాలి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోండి. చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు సహా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవద్దు.

భోజనం చేసిన గంట తర్వాత రోజుకి రెండుసార్లు జీలకర్ర, ధన్యాలతో చేసిన టీ తాగండి. వారంలో మూడు సార్లు సూప్ తాగండి. ఉదయం పూట కనీసం అరగంటపాటు ఎండలో నిలుచోండి. రాత్రిపూట తొందరగా నిద్రపోండి. ఎంత ఎక్కువ నిద్ర ఉంటే అంత తొందరగా రికవరీ కావచ్చు.

ఇలా కరోనాకి సంబంధించిన అన్ని నియమాలను పాటిస్తూనే పోషకాహారం, వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే కరోనా నుండి కోలుకున్న వెంటనే తీవ్రమైన వ్యాయామం చేయరాదు. మెల్లగా ప్రారంభించండి. నడక, శ్వాస సంబంధమైన వ్యాయామాలతో మొదలెట్టండి. ధ్యానం చేయండి. శరీరానికి ఎక్కువసేపు విశ్రాంతి ఇవ్వండి.

 

Exit mobile version