Home Health డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0

వేసవి కాలంలో ఇంట్లో ఉన్నా సరిగా నీళ్ళు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య భారిన పడే ప్రమాదం ఉంది. దాని వల్ల నిద్ర, అజీర్తి వంటి సమస్యలు వేధిస్తాయి. బాగా ఎండగా ఉన్నప్పుడు.. చల్లని పండ్లరసాలు గొంతులోకి దిగుతోంటే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగని బయట దొరికేవి ఏవి పడితే అవి తీసుకుంటే.. అనారోగ్యాలు తప్పవు. అందుకే ఏవయినా తిన్నా, తాగాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాటి నుంచి పోషకాలూ అందేలా చూసుకోవాలి. మన ఇంట్లో ఉండే హెల్తీ కూల్ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లు:

Dehydration Prevention Tipsకొబ్బరి నీళ్లు మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. పైగా కొబ్బరి నీళ్ళల్లో అవసరమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

మ్యాంగో లస్సీ:

మ్యాంగో లస్సీ కూడా ఈ టెంపరేచర్ ని తట్టుకోవడానికి బాగుంటుంది. మీరు దీనిలో తేనే వేసుకుని తాగండి. ఆరోగ్యానికి కూడా మంచిది.

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్ తాగడం వల్ల వెంటనే రిఫ్రెష్ అవుతాము. దీనిలో చల్లదనాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయి. వేడి నుండి బయట పడడానికి దీనిని తీసుకుంటే మంచిది.

బార్లీ నీళ్లు:

బార్లీలో కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఇది ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది. కిడ్నీలను కూడా ఇది శుభ్రం చేస్తుంది. ఎటువంటి టాక్సిన్స్ లేకుండా అది ఫ్రీ చేస్తుంది.

వాటర్ మెలోన్ జ్యూస్ :

వాటర్ మెలోన్ జ్యూస్ : ఈ వాటర్ మెలోన్ జ్యూస్ ను వేసవిలో పిల్లలు మరియు పెద్దలతో పాటు అందరూ తీసుకోవచ్చు. నాలుగు పీసుల వాటర్ మెలోన్ ముక్కలుగా చేసి జ్యూస్ చేసి విత్తనాలు తొలగించి తీసుకోవాలి.

తాండాయ్:

ఇది ఎక్కువగా ఉత్తర భారత దేశం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆక్టివ్ గా ఉండొచ్చు.

క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది . ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కు ఒక చెంచా పంచదార కూడా జోడించి తీసుకోవాలి . కొద్దిగా పుదీనా వేస్తే కూల్ టేస్ట్ ను అందిస్తుంది

జామ జ్యూస్:

గోవ జ్యూస్ : జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందువల్ల దీన్ని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. తయారు చేసినప్పుడు అందులోని విత్తనాలన్నీ తొలగించాలి.

ఆమ్ పన్నా:

ఆమ్ పన్నా ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడి కాయలు మరియు పుదినా ఆకులు ఉపయోగించుకుని సులువుగా చేసుకోవచ్చు. ఇది హీట్ స్ట్రోక్ వంటివి రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది.

నీళ్లు:

వేసవికి మందు మంచినీళ్లే. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నీళ్లు తీసుకెళ్లడం మంచిది. వేసవిలో దాహం గా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరిక దొరికినప్పుడు అల్లా గొంతు తడుపుకోవడమే మంచిది.

 

Exit mobile version