పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో 15 కోట్ల మంది పోషకాహార లోపంతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. అదే వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన చిన్నారులతో పోలిస్తే.. పోషకాహార లోపం గల చిన్నారులు బలహీనంగా ఉండటం, ఎదుగుదల లేకపోవటమే కాదు.. వారి పేగుల్లో వివిధ రకాల బ్యాక్టీరియా కూడా అసంపూర్ణంగా, ఎదుగుదల లేకుండా ఉంటుంది.

పిల్లల్లో పోషకాహార లోపంఆహారం ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందనేది తిరుగులేని సత్యం. మన శరీరానికి అవసరమైన అన్ని పదార్థాలు అవసరమైన స్థాయిలో శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారా బైటనుండి శరీరం పొందుతుంది. అలాంటి పదార్థాలను పోషకాలు లేదా న్యూట్రియెంట్స్‌ అంటాము. ఇవి ఆహారంలో లభించ నప్పుడు పోషకాహార లోపం లేదా న్యూట్రియెంట్‌ డెఫి షియెన్సీ ఏర్పడుతుంది. పోషకాలు ప్రధానంగా మూడు రకాలు.

పిల్లల్లో పోషకాహార లోపంఅవి – మేజర్‌ న్యూట్రియెంట్స్‌, మాక్రో న్యూట్రియెంట్స్‌, మైక్రో న్యూట్రియెంట్స్‌. మేజర్‌ న్యూట్రియెంట్స్‌ : కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను మేజర్‌ న్యూట్రియెంట్స్‌ అంటారు.

మాక్రో న్యూట్రియెంట్స్‌ : సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ మొదలైన వాటిని మాక్రో న్యూట్రియెంట్లంటారు. మైక్రో న్యూట్రియెంట్స్‌ : విటమిన్లు, కొన్ని రకాల ఖనిజాలు ఈ కోవకు వస్తాయి. రోజుకు 100 మిల్లీ గ్రాములకంటే తక్కువగా అవసరమయ్యే వాటిని మైక్రో న్యూట్రియెంట్లు అంటారు. పోషకాహారలోపం అనేది – సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కలుగవచ్చు. లేదా కొన్ని వ్యాధుల కారణంగా కాని, కొన్ని సమయాల్లో శరీరానికి అధికంగా పోషకాలు అవసరమైనపుడు కాని, లేదా పోషఖాలను సరిగ్గా జీర్ణం చేసుకోలేనప్పుడు కాని , అన్నవాహికనుంచి రక్తంలోకి పోషకాల శోషణ సక్రమంగా జరుగనపపడు కాని సంభవించవచ్చు.

పిల్లల్లో పోషకాహార లోపంపోషకాహార లోపం, మానసిక సమస్యలు పోషకాహార లోపాన్ని పరస్పరం ఉధృతం చేసుకుంటాయి. సహజంగానే బుద్ధిమాంద్యత కలిగిన వారు పోషఖాహారలోపంతో బాధపడే అవకాశాలు ఎక్కువ. వీరి మానసిక సమస్య కొంత ఈ లోపానికి దారి తీస్తోంది. మానసిక సమస్య కారణంగా వారికి ఆహారంపై శ్రద్ధ ఉండకపోవడం దీనికి కారణం. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అరటిపండ్లు, వేరు సెనగలు, సెనగలు వంటి బలవర్ధక ఆహారం ఇవ్వటం వల్ల వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుందని, ఇది వారి ఎదుగుదల మొదలవటానికి దోహదపడుతుందని తాజా పరిశోధన చెప్తోంది.

పిల్లల్లో పోషకాహార లోపంఈ ఆహార పదార్థాలు ప్రత్యేకించి పేగుల్లో ఆరోగ్యవంతమైన సూక్ష్మజీవులను పెంచటానికి బాగా ఉపయోగపడతాయని బంగ్లాదేశ్ చిన్నారులపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఆహారం అందించటం వల్ల పిల్లల్లో ఎముకలు, మెదడు, శరీరం ఎదుగుదల ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR