చాలా మంది పంచదార, స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల షుగర్ వస్తుంది అని అనుకుంటారు… కానీ నిజానికి అసలు పంచదారకు షుగర్ కు సంబంధమే ఉండదు. కాకపోతే ఒకసారి షుగర్ అటాక్ అయింది అంటే ఇక కచ్చితంగా పంచదార, స్వీట్స్ మానేయాల్సిందే. అసలైతే సరైన ఫుడ్ తినకపోవడం వల్ల, అతిగా కార్బోహైడ్రెడ్స్ ఉండే ఫుడ్స్ తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా శారీరక వ్యాయామం ఉండాలి. రోజు 10 గంటలు ఏసిలో ఉండి 1 గంట కూడా శారీరకంగా పని చేయకపోతే మీకు ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి షుగర్ అటాక్ అవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో చూద్దాం.
- మీకు ఎంత ఆకలి వేస్తే అంత మాత్రమే తినండి.
- బొజ్జ పెరిగేలా చేస్తే అనేక రోగాలకు పుట్ట అవుతుంది మన శరీరం.
- మైదా, పాలు, చీజ్ , బటర్, గోదుమరవ్వ, కార్న్ పంచదార వీటికి దూరంగా ఉండాలి.
- బిస్కెట్స్, మఫిన్స్ వంటి ప్రాసెస్డ్, రిఫైన్స్ వెరైటీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- అన్నీరకాల పీచుపదార్దాలు ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోండి
- మంచి నిద్ర ఉండేలా చూసుకోండి
- నెయ్యి, నట్స్, సీడ్స్ మీ భోజనంలో చేర్చుకోండి
- రోజూ బబ్సీలు మిక్చర్లు కేసులు ఇలా కాకుండా యాపిల్ బత్తాయి కమలా అరటిపండు తినండి
- కిచిడీ- కడీ, అన్నం-పప్పు, అన్నం- పెరుగు, ఎగ్స్- రోటీ ఇవి తీసుకుంటే మంచి ప్రొటీన్ వస్తుంది
- కార్పొహైడ్రెడ్స్ ఫుడ్ అధికంగా తీసుకోవద్దు
- టీ కాఫీ మానెయడం ఉత్తమం.