వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే దుష్ప్రభావాలు ఉండవు

కరోనా విలయతాండవం చేస్తున్న వేల భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పుడు రెండో దశ వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. మొదటి దశలో తీసుకున్నవారు రెండో దశలో వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏమాత్రం వెనకాడకుండా వ్యాక్సీన్ వేయించుకుంటున్నారు. 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వారియర్స్కు వాక్సినేషన్ అందించగా, 2021 మార్చి 1 నుంచి రెండో దశన ప్రారంభమైంది. అయితే ఈ రెండో దశ వ్యాక్సిన్ ప్రక్రియలో- భాగంగా 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, 45 నుండి 59 ఏళ్ల మధ్య గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు కోవిడ్‌ టీకా ఇస్తున్నారు.

caronaకాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. అన్ని భద్రత చర్యలు తీసుకున్న తర్వాతే ఈ రెండు వ్యాక్సిన్లను ప్రవేశపెట్టినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

precautions you must take before and after getting your covid vaccineఅయితే, కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తుండటంతో, అక్కడక్కడా కొద్ది మందికి స్వల్పంగా రియాక్షన్ కావడంతో కొంతమంది టీకా వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని, వాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

కరోనా టీకాలు వేయించుకున్న తరువాత కలిగే చిన్నపాటి దుష్ప్రభావాలను తెలుసుకుందాం :

కరోనా టీకా వేయించుకున్న తర్వాత ఇంజెక్షన్‌ ఇచ్చిన భాగంలో స్వల్పంగా నొప్పి, వాపు, జ్వరం, చలి, అలసట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి సయయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.

precautions you must take before and after getting your covid vaccineవ్యాక్సిన్‌ విషయంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్‌ను అడగొచ్చు. అయితే సాధారణంగా, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే దుష్ప్రభావాలు- ఒకటి లేదా రెండు రోజుల కన్నా ఎక్కువగా ఉండవు.

precautions you must take before and after getting your covid vaccine ఒకవేళ ఉంటే, వైద్యుడిని సంప్రదించాల్సివుంటుంది. ఆందోళన చెందనక్కర్లేదు. మీ వైద్యుడు చెప్పిన జాగ్రత్తలను పాటించండి. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ వేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

precautions you must take before and after getting your covid vaccineవ్యాక్సిన్ తీసుకునే ముందు వ్యాక్సిన్ గురించి పూర్తి వివరాలు తెల్సుకోవాలి.

వ్యాక్సిన్ వేసుకునే కొద్ది గంటల ముందు తేలికపాటి భోజనం చేయండి. ఎందుకంటే, వ్యాక్సిన్ వేసుకున్నాక కొద్ది సేపు వరకు మీరు ఏమీ తినకపోవడం మంచిది.

వ్యాక్సిన్కు ముందు కొద్ది సేపు విశ్రాంతి తీసుకోండి. పాజిటివ్గా ఆలోచించండి. ఒకవేళ, మీరు ఆందోళన చెందుతున్నట్లయితే, అక్కడ ఉండే వైద్య సిబ్బంది నుండి ఆరోగ్య సలహాలు, సూచనలు తీసుకోండి.

వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లే సమయంలో తేలికపాటి, సౌకర్యవంతమైన బట్టలనే ధరించండి. తద్వారా, మీ చేతి భుజానికి వ్యాక్సిన్ షాట్ ఇచ్చేటప్పుడు సక్రమంగా కూర్చోగలరు.

precautions you must take before and after getting your covid vaccineవ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెళ్లే ముందు మాస్క్‌ తప్పనిసరిగా ధరించి వెళ్లాలి. వ్యాక్సిన్ కేంద్రంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

వ్యాక్సిన్ వేసే ముందు లేదా వేసిన తర్వాత ఆల్కహాల్ లేదా ఏదైనా మత్తు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు.

టీకా కేంద్రంలో ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న వస్తువులను లేదా ఇతర రోగులను తాకవద్దు. వ్యాక్సిన్ కేంద్రంలో COVID-19- ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలి.

మీకు ఏదైనా జబ్బులు ఉన్నట్లయితే ఆ విషయాలను వైద్యుల వద్ద దాచకుండా నిజాలు చెప్పేయాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR