తిన్న తరువాత సోడా తాగే అలవాటు ఉందా? ఇది తెలుసుకోండి!

ఏదైనా ఫంక్షన్ కి గానీ, పార్టీకి గాని వెళ్ళినపుడు భోజనం తరువాత ఓ సోడా తాగడం, పాన్ నమలడం చాలా మందికి అలవాటు. బయటకు విందుకు రెస్టారెంట్ కి వెళ్తే చాలు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తో పాటు సోడాను కూడా ఆర్డర్ చేస్తుంటారు. కడుపునిండా భోజనం చేసిన తరువాత ఒక సోడా తాగితే తిన్నది చక్కగా అరుగుతుందని, గ్యాస్ట్రిక్ సమస్యలు వుండవని నమ్ముతారు. కానీ ఆ నమ్మకాలు ఇప్పుడు మూఢ నమ్మకాలు అంటున్నారు నిపుణుులు. రోజు సోడా సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు అధికమవుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.

Problems caused by drinking too much sodaసోడాలో ఎక్కువ మోతాదులో చక్కెర స్థాయిలు ఉంటాయి. అందువల్ల ఒక గ్లాసు పరిమితికి మించి సోడా తాగేవారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంతకుమునుపే ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లలో ఒక గ్లాసుకు మించి సోడా తాగే వాళ్లకు “రిస్క్ ఆఫ్ డెత్” ఎక్కువని జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Problems caused by drinking too much sodaతీపి పదార్థాలు తినే వారికన్నా 2 ఔన్సుల సోడాను రోజూ సేవించేవారే రెండింతలు ఎక్కువగా మరణిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. సోడాను తాగడం ద్వారా డయాబెటిస్, హృద్రోగ వ్యాధులు వస్తాయని పరిశోధనల్లో తేలింది. సోడాను తరచూ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు సులువుగా అంటుకుంటాయట. గుండెపోటు, కిడ్నీ, డయాబెటిస్ సమస్యలు తప్పవు. రెగ్యులర్‌గా సోడాను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రాత్రిపూట సోడా తాగితే ఒబిసిటీ తప్పదు.

Problems caused by drinking too much sodaకొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ లో దొరికే సోడా తాగడం వల్ల ప్రమాదకరమైన భావించి అల్యూమినియం టిన్ లో దొరికే సోడాలను తాగుతున్నారు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేశారు. సోడాలలో ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడటం వల్ల వీటి ప్రభావం డిఎన్ఏ పై చూపి క్యాన్సర్ కి దారి తీస్తాయని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Problems caused by drinking too much sodaముఖ్యంగా సోడాలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.షుగరీ సోడా కంటే డైట్ సోడాలు మూడు రెట్లు ప్రమాదమని నిపుణులు తెలియజేశారు. అందుకోసమే అత్యంత ప్రమాదకారిగా ఉన్న ఈ సాఫ్ట్ డ్రింక్స్ కి బదులుగా చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెరగడంతోపాటు, రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR