అతిగా నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా ?

మనిషి శరీరంలో సగం కన్నా ఎక్కువ నీరే ఉంటుంది. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న డ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం సరిపడినంత నీటిని తీసుకోవాలి. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. అయితే కొంతమంది నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. మరికొంత మంది నీటిని ఎక్కువగా తీసుకుంటారు.

Drink Waterచాలా మంది సెలబ్రిటీలు కూడా తమ అందం, ఆరోగ్యానికి మంచి నీళ్లే కారణమని చెబుతుంటారు. అయితే ఎంత నీరు తాగాలో అంతే తాగాలి. ఎక్కువ నీరు తాగినా ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు. మరి నీరు అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Drink Waterఇక మంచి నీరు అతిగా తాగకూడదని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు రక్తం పెరగడం కారణంగా రక్తనాళాలు, గుండెపై అదనపు భారం పడుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.

Drink Waterనీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇక శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయి తగ్గి మరణానికి దారి తీస్తుంది. అతిగా నీరు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తగినంత నీటిని తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR