Home Unknown facts రాహు గ్రహ సామర్థ్యం వలన ఎదురయ్యే సమస్యలు

రాహు గ్రహ సామర్థ్యం వలన ఎదురయ్యే సమస్యలు

0

కొత్తదాన్ని దేన్నయినా తెచ్చిపెట్టే స్వభావం రాహువుది. మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు కానీ,అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. రాహువు గారడీ చేయిoచే శక్తి కలవాడు. అబద్ధాలు, అల్లకల్లోలాలు,క్రొత్త అలవాట్లు.క్రొత్త వేష భాషలు కల్గించడంలో సిద్దహస్తుడు. గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువు తలగా రాహువును,తోకగా కేతువును ప్రతీకలుగా చిత్రీకరించారు.

rahuvuశని వాలే రాహువు కర్మ గ్రహం. పూర్వ జన్మ కర్మల్ని అతివిడ్డురంగా అనుబవింపచేయగలడు. దుర్మార్గ స్వభావం కలవారు అందలం ఎక్కడానికి సహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత నివ్వడానికి,రాహువు బాగా సహకరిస్తాడు. రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ,అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత,తల్లి,అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. ఫారిన్ భాషలు,ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో కూడా రాహువుదే అగ్రతాంబూలం.

  • రాజ్యాధికారం కల్పించడంలో రాహువు కారకుడు
  • వర్ణాంతర వివాహాలు చేసుకోవటంలో ప్రభావం కలవాడు.
  • కుట్రలు,పన్నాగాలు,ఎత్తు గడలు,కూలద్రోయడం వంటి నీచ గుణాలు కల్గిస్తాడు.
  • సాంప్రదాయాల సంస్కరణను మతభ్రష్టం పట్టిస్తాడు.
  • తక్కువ స్టితికల స్త్రీ సాంగత్యానికి పూరి కోల్పుతాడు. వ్యసనపరులుగా,తిరుగుభోతులుగా మార్చి దుష్ట స్నేహాలను కల్గిస్తాడు.
  • నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు
  • పీడ కలలు,భయదోళనలు కల్పిస్తాడు.
  • రహస్య స్టావరాల పనులు,రహస్య మంతనాలను ప్రేరేపిస్తాడు.
  • వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు
  • ఉర్దూ,పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు రాహువు.

రాహువు కల్గించే భాదలు :

  • స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించడం.
  • ముర్ఖునిగా ప్రవర్తించడం,అధికార దుర్వినియోగం చేసి అల్లరి పాలవుతారు.
  • ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు, పోలీస్ గూడచారి సంస్తల వల్ల భాదలు కలుగుతాయి.
  • కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవడం, కోర్టు వ్యవహరల్లో ఇరుక్కు పోవడం
  • మిలటరీ సంబంధ, బిల్డింగ్ కాంట్రాక్టు సంబంధ నష్టాలు
  • పాములు, తేళ్ళు,గేదెలు,విష జంతువుల వల్ల భాధలు
  • విష గ్యాసులు,ఆమ్లాలు,వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు.
  • ఎక్కడికో పారి పోదామనే మానసు చంచలం
  • జైలు వరకు తెసుకొని పోయేలా చేయిస్తాడు.
  • చంద్రునితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం కానీ పిచ్చి కానీ కల్గించవచ్చును.
  • కుజుని తో కలిసి ఆకస్మిక ప్రమాదాలు,దెబ్బ లాటలు,గాయాలు కల్గిస్తాడు.
  • రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు.
  • శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును.
  • గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్టితిలలో తప్పులు చేయిస్తాడు.
  • ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్ఘతం చేసి పరువు తీయిస్తాడు.
  • రాహువు ఎంత యోగం కల్గించినా,ఎంతో కొంత అప్రతిస్ట చేయకుండా ఉండలేడు.

 

Exit mobile version