రోజు నిమ్మరసం తాగుతున్నారా, ఈ విషయం తప్పక తెలుసుకోండి!

నిరాహార దీక్షలు చేసే వారిని దీక్ష విరమిపచేయడానికి నిమ్మరసం ఇవ్వడం చూస్తూనే ఉంటాం. దానివల్ల ఎంత నీరసంగా ఉన్న శరీరానికైనా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే ఎండలో బయటకు వెళితే జ్యూస్‌, మంచినీటికి బదులుగా లెమన్‌సోడా తాగుతుంటారు. శీతాకాలం, వేసవికాలం ఏ సమయంలో అయినా నిమ్మరసం తాగేందుకు వెనుకాడరు.

lemon juiceశరీరానికి తేమ అందించే విధంగా నిమ్మరసం పనిచేస్తుంది. నిమ్మరసంలో విటమిన్‌ సి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బాడీ డీహైడ్రేషన్‌ కాకుండా చేస్తుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అధిక బరువు తగ్గిస్తుంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆరోగ్య కారణాల వల్ల ఉదయాన్నే చాలా మంది నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటారు.

lemon juiceబరువు తగ్గడానికి కొందరు నిర్మరసం తాగితే, శరీరంలో విష పదార్థాలు తొలగిపోవాలని మరికొందరు నిమ్మరసం, తేనే కలుపుకుని తాగుతుంటారు. నిమ్మరసాన్ని అంత ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు. సాధారణంగా నిమ్మరసాన్ని ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగుతుంటారు. ఐతే బాగుంది కదా అని ఎక్కువ నిమ్మరసం తాగకూడదు.

Health Benefits Of Teff Grainరోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు. నిమ్మరసాన్ని అధికంగా తాగే తొలి రోజుల్లో ఎలాంటి తేడా కనిపించదు. కానీ రోజులు గడిచేకొద్దీ నెగెటివ్ ఎఫెక్ట్ మొదలవుతుంది. అలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొన్ని రకాల సమస్యలు తీవ్రమై వెంటాడతాయి.

lemon juiceనిమ్మరసం అధికంగా తాగితే గుండెలో నొప్పి, మంట పెరుగుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్య ఉన్న వారు నిమ్మరసం తక్కువగా సేవించాలి. పొట్టలో ఆమ్లత్వం పెరిగితే ఆహారం త్వరగ జీర్ణమై ఉదర సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. తద్వారా గుండెల్లో మంటను కలిగిస్తుంది.

lemon juiceచాలామంది నిమ్మరసాన్ని డైరెక్ట్‌ తీసుకుంటారు. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే దంతాలు దెబ్బతింటాయి. దంతాలపై ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. దీంతో దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. నాలుకతో పళ్లను తడిమినప్పుడు గరుకుగా తగులుతుంటుంది. దీనికి ఇదే గుర్తు. వెంటనే నిమ్మరసం వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలి.

lemon juiceసాధారణంగా నోటిలో కొందరికి సమస్యలు వస్తాయి. ఒంట్లో అధిక వేడి కారణంగా నోటిపూత వస్తుంది. నోటిలో పొక్కులు లాంటివి ఏర్పడతాయి. దీనిని మౌత్ అల్సర్ అని కూడా అంటారు. నిమ్మరసం అధికంగా సేవిస్తే కొందరికి నోటిపూత సమస్య తలెత్తుతుంది. దానివల్ల ఆ సమయంలో ఆహారం తినడం కూడా పెద్ద ఇబ్బందిగా మారుతుంది.

lemon juiceనిమ్మరసానికి నాలుకకు అవినాబావ సంబంధం ఉన్నట్లుంటుంది. కొన్నిరోజుల పాటు ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల నాలిక రుచి స్పందన పోతుంది. నాలుక మండుతుంది. అక్కడక్కడా పగుళ్లు ఏర్పడుతాయి. అసౌకర్యంగా అనిపిస్తుంది. దీంతో సరిగా మాట్లాడలేరు. ఇవి వారంపాటు అలానే ఉంటాయి.కొంతమందికి తలనొప్పిగా ఉన్నప్పుడు టీ తాగుతారు. మరికొంతమంది ఆకలితో తలనొప్పి వస్తుందని నిమ్మరసం తాగుతారు. అలా తాగడం వల్ల తలనొప్పి వస్తుందని కొందరు అంటున్నారు. వీరు నిమ్మరసానికి ఎంత దూరంగా అంత బెటర్‌.

lemon juiceనిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను పెంచే లక్షణాన్ని కలిగి ఉంది. అధికంగా నిమ్మరసం తాగితే ఇది శరీరంలో అదనపు ఉప్పును బయటకు పోయేలా చేస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేయడం ద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గిస్తుంది. తత్ఫలితంగా డిహైడ్రేషన్ బారిన పడతారు.

disease due to drinking bed coffeeమోతాదుకి మించితే ఏదైనా ప్రమాదమే.. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే అల్సర్లు, అసిడిటీ సమస్యలు కడపునొప్పి వస్తాయి. పేరు కూడా తెలియని కొత్త రోగాలు సంతరించుకుంటాయి. దీనివల్ల పొట్టలో వేడి, వికారం, వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR