వాయు కాలుష్యం ఊపిరితిత్తులను కాపాడుకోండిలా!

కరోనా వచ్చాక ఆరోగ్యంపై జాగ్రత్త ఎక్కువైంది. తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ, పీల్చే గాలి విషయంలో మనకింకా పూర్తి స్థాయిలో ఆ స్పృహ రాలేదు. నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా వినియోగి స్తాం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం.
సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య తేడా అదే. మృత శరీరాల్లా కుళ్లిపోకుండా మనం బ్రతకగలుగుతున్నాం అంటే అందుకు కారణం ప్రాణవాయువే. ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే, అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుర్దాయాన్ని కోల్పోతున్నాం. కరోనా లాక్ డౌన్ వల్ల కాలుష్యం కొంత వరకు అదుపులోకి వచ్చినా ఇప్పుడు మళ్ళీ యధావిధిగా కొనసాగుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం ఎంత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరిందో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం ఢిల్లీనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోనూ రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో నిత్యం ఆ కాలుష్యాన్ని పీలుస్తున్న ప్ర‌జ‌లు అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డుతున్నారు. చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్లు వ‌స్తున్నాయి.
దీని వల్ల ప్రతిఒక్కరి ఊరిపితిత్తుల పనితీరు సన్నగిల్లడమే కాకుండా ఈ వాయు కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో చేసిన ఒక ఔషధంతో ఈ ఇబ్బందులను అందిగమించవచ్చు. ఆ ఔషధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన శరీరంలోని వ్యర్థవాయువులను బయటకు తీయడంలో మన ఊపిరితిత్తులు సహాయపడతాయి. అవి దూమపానం చేయడం వల్ల, పీల్చే కలుషిత వాయువుల వల్ల దెబ్బతింటున్నాయి. ఇవి శుభ్రపరచుకోవడానికి రోజు ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచం మిరియాల పొడి కలిపి నీటిలో బాగా మరిగించి వేడి టీ లాగా తాగండి. జీలకర్ర నీరు డీకంజెస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల ఛాతీలో ఏదైనా శ్లేష్మం చేరడాన్ని నియంత్రించడమే కాదు ఊపిరితిత్తులు శుభ్రం చేసేందుకు ఒక ఔషధం లాగ పనిచేస్తుంది.
అంతే కాదు ఈ ద్రావణం త్రాగడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. జీలకర్ర నీరు గొప్ప హైడ్రేటర్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీరు తాగడానికి సరైన సమయం ఉదయం ప్రాణాయామం చేసిన అనంతరం దీన్నితాగడం వల్ల మంచి పనితీరును కనపరుస్తది. వీటితో పాటు అల్లం రసం, పసుపు నీటితో ఆవిరి పట్టిన ఊపిరితిత్తులలో ఉన్న వ్యర్దాలు తొలగే అవకాశం ఉంది. చేతులు వెనకకు పెట్టి ముక్కుతో గాలి పీల్చి పొడి దగ్గు దగ్గడం వల్ల కూడా ఊపిరితిత్తులు శుభ్రపడతాయి.
గ్రీన్ టీ కూడా శరీరంలోని వ్యర్థాలను తొలగించే ఉపకారిగా పని చేస్తుంది. అలాగే బయటకు వెళ్ళివచ్చినప్పుడు బెల్లం కానీ తేనే తీసుకోవడం మంచిది. ఇవి సన్నని దుమ్ము, దూళి రవ్వలు ఊపిరితిత్తుల లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ చిట్కాలు పాటించడంతో పాటు బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల కేవలం కరోనా నుండే కాదు కాలుష్యం నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. కరోనా తగ్గిపోయినా మాస్క్ లు పెట్టుకోవడం మంచి అలవాటు. ఒకవేళ బయటకు వెళ్ళినపుడు మాస్క్ అందుబాటులో లేకపోతే చేతి రుమాలో లేదా స్కార్ఫ్ లాంటిదో ముక్కును, నోటిని కవర్ చేసే విధంగా కట్టుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR