అల్లం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో తెలుసా

అల్లం ఆరోగ్యానికి మంచిదని మన అందరికి తెలిసిందే. అయితే, దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మన శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే టీలో అల్లం కలుపుకుని తాగినా, లేదా అల్లాన్ని తిన్నా అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. మరి అల్లం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం..

Health Benefits of Gingerఅల్లం మన శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రోజూ అల్లాన్ని తీసుకోండి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్థాయి..

Health Benefits of Gingerఅల్లం అధిక బరువును తగ్గించటంలోనూ సహాయపడుతుంది.. మనలో చాలామంది ఈ లాక్‌డౌన్ వల్ల ఇప్పుడు బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా కొన్ని రోజులు ఈ పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశము లేకపోలేదు కాబట్టి బరువు తగ్గడంపై దృష్టిపెట్టండి. అల్లం మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో ఎక్కువ క్యాలరీస్ ను బర్న్ చేస్తుంది.. తద్వారా బరువు తగ్గవచ్చు..

Health Benefits of Gingerమధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే సైతం పేర్కొంది. అలాగే, మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం చాల ఉపయోగపడుతుంది.

Health Benefits of Gingerఅలాగే వ్యాయమం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలోనూ అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.

Health Benefits of Gingerఅల్లం జలుబు, దగ్గుకు మంచి ఉపశమనం, అల్లంలో జింజెరోల్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.. ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్నీ క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది.

ఇక అజీర్ణ సమస్యలకు అల్లం అద్భుతమైన ఔషధం.. కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్తి సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం చాలా మంచిది. కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది. వికారంతో బాధపడుతున్నవారికి ఇది మంచి మందులా పనిచేస్తుంది.. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లాన్ని మీ డైలీ ఆహారంలో చేర్చుకుని రోగనిరోధకశక్తిని పెంచుకుందాం..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR