10 Life-Changing Quotes Of Osho That’ll Make You Feel Fresh Ahead Of 2023

10 Life-Chnging Quotes Of Osho That’ll Make You Feel Fresh Ahead Of 2023

ఓషో బోధన జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎఱుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని అతను బోధించాడు. జ్ఞానోదయం (ఎన్‌లైటెన్‌మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు – మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని అతను అన్నాడు

ఓషో చెప్పిన మాటల్లో కొన్ని…..

1. ఒకరిలా అవ్వాలని ప్రయత్నించకు, నువ్వు ఇప్పటికే ఒకటి అయిపోయావు. మారలేవు. మార్చుకోలేవు. నువ్వు కేవలం నీలో ఉన్నేదేంటో తెలుసుకోవాలంతే.

2. జీవితం మొదలయ్యేది నీలోని భయం చచ్చిపోయినప్పుడే.

3. ఆనందమైనా.. బాధైనా నీ గతం నుంచి వచ్చినవే. వీటికి ఎవరూ బాధ్యులు కాదు నువ్వు తప్ప. నీ ప్రమేయం లేకుండా నీలో ఏ భావాన్ని ఇతరులు సృష్టించలేరు.

4. అందరూ చెప్తుంటారు, దూకే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, నేను చెప్తాను ముందు దూకేయ్.. ఆ తర్వాత ఎంత దూరం వెళ్లాలో ఆలోచించుకో.

5. ఆనందం పొందేందుకు రహస్య మార్గమేమంటే, నీ మనస్సును గతంలో వదిలేయకు, భవిష్యత్‌లో విహరించమని సూచించకు, నీ సంతోషాన్ని ఎవరూ పాడుచేయలేరు.

6. ఒంటరితనం ప్రేమకు నాందివంటిది. వినేందుకు వ్యతిరేకంగా అనిపించినా అది నిజం కాదు. ప్రేమించగల సామర్థ్యం ఉన్న వారే ఒంటరితనాన్ని జయించగలరు. వేరే వాళ్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇతరులతో అన్ని విషయాలు ముడిపెట్టుకోకుండా ఉన్న స్వతంత్ర్యులే ప్రేమకు అర్హులు.

7. చనిపోయాక మరో జీవితం ఉంటుందో లేదోననేది విషయం కాదు, బతుకున్నంత కాలం ఎలా బతికామనేది ముఖ్యం.

8. మిలియన్ల కొద్దీ మనుష్యులు బాధపడుతున్నారు, ప్రేమించడం రాకపోయినా ప్రేమించబడాలని కోరుకుంటున్నారు, వారికి తెలియన విషయమేమిటంటే ప్రేమంటే ఒక్క పదం మాత్రమేనని. కేవలం ఒక్క పదం మాత్రమేనని.

9. నువ్వు ఎలా అవ్వాలనుకుంటావో అలాగే ఉండు. ఇది కేవలం నీ బాధ్యతే.

10. చాలా మంది జీవితంలోకి వచ్చి వెళ్లిపోతుంటారు, అది నాకు చాలా మంచి చేసింది. ఎందుకంటే వాళ్లు వెళ్లిన ప్రతిసారి ఆ ఖాళీని మరింత మంచి వాళ్లు పూర్తి చేస్తున్నారు, ఇలా నేనెప్పుడూ కోల్పోయిన వాడిలా మిగలలేదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR