RadhaKrishnula Prema mandhiram Brundavanam

0
4399

దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో రాధా కృష్ణులు కొలువై ఉన్న ఈ ప్రేమమందిరం ఒకటి. దీనినే బృందావనం అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటిలో కూడా కృష్ణ భక్తి వెల్లివిరుస్తుంది. మరి రాధాకృష్ణుల‌ ప్రేమమందిరం అయినా ఈ బృందావనం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. radhakrishnulaఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో బృందావనం ఉంది. యమునానది తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ కృష్ణుడు గోపికలతో రాసలీల గావించిన స్తలంగా మరియు రాధా కృష్ణుల ప్రణయానికి వేదికగా వర్ణించబడింది. ఈ క్షేత్రంలోనే మీరాబాయి, సూరదాసు మొదలగు భక్తులు గీతాలు ఆలపించారు. ఈ బృందావనంలో నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలు భక్తులని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇందులో ముక్యంగా చూడాల్సిన ఆలయాలు ఎనిమిది ఉన్నాయి.radhakrishnulaఇక ఈ ఆలయ నిర్మాణకి వస్తే, ఈ ఆలయంలో ప్రధాన దైవంగా రాధాకృష్ణులు, సీతారాములు కొలువబడుతున్నారు. ఈ దేవాలయ ప్రధాన నిర్మాణం చలువరాతితో తయారై అందంగా కనిపిస్తుంది. ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం నలువైపులా శ్రీకృష్ణుడు మరియు అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. ఇంకా దీనికి మొత్తం అయినా ఖర్చు దాదాపుగా 150 కోట్లు. దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్స్ వాడారు. ఆలయ నిర్మాణం కోసం మార్బుల్స్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రోబోటిక్ యంత్రాలను కూడా వాడారని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం అంత మార్బుల్స్ తోనే నిర్మించబడటం విశేషం. ఇంకా ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశ ఆలయ నిర్మాణాలను పోలి ఉంటుంది. radhakrishnulaఇంతటి పవిత్రమైన రాధాకృష్ణుల ప్రేమ మందిరం బృందావనాన్నిహిందువులు వారి జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలని కోరుకుంటారు.radhakrishnula