రామనాథ స్వామి ఆలయ రహస్యాలు!

దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రాలలో దేవాలయాలన్నింటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో రామనాథ స్వామి దేవాలయం ఒకటి. ఈ రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ ఆలయం రహస్యాలు తెలుసుకుందాం…

Ramanatha Swamy Temple tamil naduదేవుడు ఉన్నాడని కొందరు, లేడు అంటూ మరి కొందరు ఎన్నో వందల ఏళ్లుగా వాదించుకుంటూనే ఉన్నారు.
అయితే దేవుడు లేడు అంటూ సాక్ష్యాలు చూపించే వారి కంటే కూడా దేవుడు ఉన్నాడు అంటూ సాక్ష్యాలు చూపించే వారు ఎక్కువగా ఉన్నారు.

Ramanatha Swamy Templeఅలాగే దేవుడు ఉన్నాడని చెప్పేందుకు సాక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ రహస్యంను కొందరు శాస్త్రవేత్తలు ఎంతగా అన్వేషించినా కూడా ఎలాంటి ఆదారం లభించదు.

తమిళనాడు లోని రామేశ్వర ఆలయం దేవుడు ఉన్నాడని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. నిన్న మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా కరువుతో జనాలు కటకటలాడారు.

water scarcity in tamil naduఎంతో మంది నీటి కొరత కారణంగా మృతి చెందిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా చెన్నైలో నీటి పరిస్థితి ఎంతటి దారుణమైన స్థితికి చేరిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి ఎద్దడి కారణంగా కొన్ని కంపెనీలను మూసేయడం జరిగింది.మరి కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

Ramanatha Swamy Temple tamil naduచెన్నైలో గత 100 ఏళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదు అనేది స్థానికుల మాట. ఒక వైపు చెన్నైలో కరువుతో జనాలు విలవిలలాడుతున్నారు. ఎంతో లోతు బోరు వేసినా చుక్క నీరు లేని పరిస్థితి. కొన్ని దేవాలయాలు నీరు లేని కారణంగా మూసేయడం జరిగిందని వార్తలు చూశాం. కాని రామేశ్వరంలోని రామనాధ స్వామి ఆలయంలో మాత్రం అద్బుతం కనిపించింది.

Ramanatha Swamy Temple wellsతమిళనాడు మొత్తం కూడా కరువుతో జనాలు ఇబ్బందులు పడుతూ ఉంటే రామనాధ స్వామి ఆలయంలోని 22 బావుల్లో నీరు పైకి ముంచుకునే విధంగా ఉన్నాయి. అక్కడ బావుల్లో నీరు ఎప్పుడు ఎలా అయితే ఉండేదో అలాగే ఉంది. ఏమాత్రం నీటి శాతం తగ్గక పోవడంతో అందరికి ఆశ్చర్యంను కలిగించింది.

నీటిలో నీరు శాతం తగ్గక పోవడానికి శాస్త్రవేత్తలు కూడా కారణం గుర్తించలేక పోయారు. 22 బావుల్లో నీరు పుష్కలంగా లభించడంతో పాటు ఆ బావుల్లో నీరు వేరు వేరు రుచులను కలిగి ఉండటం మరింత ఆశ్చర్యకరం.

Ramanatha Swamy Temple wellsఇదే దేవుడి మాయ అంటూ స్థానికులు అంటున్నారు. సీతా రాములు ఏర్పాటు చేసిన ఈ గుడి ఎప్పుడు పచ్చగా ఉంటుందని, వారి మహిమ వల్లే బాయిల్లో నీళ్లు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
దేవుడు ఉన్నాడు అనేందుకు ఇంతకు మించి మంచి ఉదాహరణ ఏముంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR