రాముడే ఎందుకు అంటే.. సీతమ్మ చెప్పిన సమాధానం ప్రతీ స్త్రీ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం

0
424

నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి భర్త తేలేని స్థితిలో ఉన్నప్పుడు, అందరి ముందూ తులనాడుతూ, అవహేళన చేస్తూ, అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు. భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో రామాయణంలో శ్లోక రూపంలో పేర్కొన్నారు..

Ramayanamపతివ్రతా ధర్మాన్ని ఆచరించి చూపిన మహా పతివ్రత సీతమ్మ తల్లి రావణునిచే అపహరింప బడి అశోకవనంలో ఉన్నప్పుడు అక్కడి రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ, అత్యంత రమణీయం. వాల్మీకి మహర్షి విరచిత రామాయణంలో సుందర కాండము అత్యంత ప్రశస్తమూ, రసబంధురం. లంకా రాజ్యములో రావణుని అశోక వనములో శింశుపా వృక్షము కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు పలు విధాలా దూషిస్తారు. రావణుని వరించి సుఖించమని లేకున్న చంపి తినేస్తామని బెదిరిస్తారు.

Sita Deviరావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెడతాడు. అయినా మహాపతివ్రత అయినటువంటి సీతా సాధ్వి కొంచెం కూడా చలించలేదు. ఆమె సుగుణాలు తెల్సిన రాక్షస స్త్రీలు మారారు.. సీతమ్మ రావణాసురుని లంకా సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది. సీతమ్మ సుగుణాలకు ముచ్చట పడిన రాక్షస కాంతలు, ఎందుకు నువ్వు రాజ్యము వైభవం ఏ మాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు. ఆయన్ని నువ్వు తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు. దానికి సీతా మహా సాధ్వి ఇచ్చిన సమాధానం అద్భుతం..

Sitha Deviతన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా..ఆయన యొడల నిత్యం అనురక్తితో సూర్య భగవానుని సువర్చలా దేవి , ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్టులవారిని అరుంధతి, చంద్రుని వరించి ఆతన్నితోనే అనురక్తురాలైన రోహిణీ తార వలే , అగస్త్య మహామునిని సేవించిన లోపాముద్ర మాదిరి, చ్యవనుని సేవించిన సుకన్యవోలె, సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రి వలే, కపిలమహామునిని సేవించిన శ్రీమతి వలే, సౌదాసుని అనుసరించిన మదయంతి వోలె, సగర చక్రవర్తి ని అనుసరించిన కేశిని వలే, నలమహారాజుని వరించిన భీమ రాజ పుత్రి దమయంతీ దేవి వలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడముతో సీత శీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు. ఇదీ మన దేశపు స్త్రీల యొక్క ఔన్నత్యం. ఇదే మన భారత దేశ సౌభాగ్యము.

SHARE