ఇంద్రునికి వజ్రాయుధం ఏ విధంగా లభించిందో తెలుసా ?

పురాణాలలో అందరూ దేవతలకు ఆయుధాలు సహజం. దేవతలకు రాజైన ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం. ఈ వజ్రాయుధం చాలా సందర్భాల్లో దేవతలను కాపాడింది. ఈ వజ్రాయుదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది లోహాలతో కాకుండా ఒక ముని వెన్నుముక తో తయారు చేయబడింది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. త్వష్ట అనే ప్రజాపతి కి సర్వ విజ్ఞాన పరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి మూడు తలలు. విశ్వరూపుడు ఒక నోటితో సురాపానం ఒక నోట సోమపానాన్ని చేస్తాడు. మూడవ నోటితో ఆహారం తినేవాడు.దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు. ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు. అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు. గురువు స్థానంలో ఉన్న విశ్వరూపున్ని పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వ శ్రేష్ఠున్ని చంపి ఇంద్రుడు బ్రహ్మ హత్యాదోషం మూటగట్టుకున్నాడు. ఆ హత్యాదోషాన్ని ఒక యేడు భరించగలిగాడు.

Vajrayudhamఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు, భూమికి ఒక వరం ఇచ్చాడు. ఎంత గొయ్యి అయినా పూడి తిరిగి యధా రూపం సంతరించుకునేటట్లు వరం ఇచ్చి ప్రతిగా తన పాపాన్ని నాలుగవ వంతు భూమికి ఇస్తాడు. ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రం అయినా తిరిగి పవిత్రం అయ్యేటట్లు నీటికి వరం ఇచ్చి ఇంకో నాలుగవ వంతు పాపాన్ని ఇస్తాడు. అలాగే చెట్లకు కూడా ఒక వరం ఇస్తాడు. ఎన్ని సార్లు కొట్టివేసినా తిరిగి చిగురించేలా వరం ఇస్తాడు. అలా ఇంకో నాలుగవ వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు. స్త్రీలకు కామ సుఖాలతో పాటు సంతానం కలుగేటట్లు వరం ఇచ్చి నాలుగవ వంతు పాపాన్ని స్త్రీలకు పంచిస్తాడు. అలా ఇంద్రుడు ఆ బ్రహ్మ హత్యాదోషం నుంచి విముక్తి పొందుతాడు.

Vajrayudhamఇంద్రుడి బ్రహ్మ హత్యాదోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవడం చేత భూమికి చవిటి నేలలు, నీటికి నురగలు, చెట్లకు జిగురు, స్త్రీలకు రజస్సు ఈ దోషం వల్లనే కలుగుతున్నాయి. విశ్వరూపుని ఇంద్రుడు చంపడం చేత త్వష్టకు పుత్రశోకం గలిగింది. దానిని సహించలేక అతడు ఇంద్రుని చంపగలిగే కొడుకు పుట్టాలని యజ్ఞం చేసాడు. యజ్ఞకుండములోనుండి భయంకరరూపముతో రాక్షసుడు ఒక్కడు పుట్టాడు. వాడే వృత్రుడు.

Vajrayudhamబ్రహ్మ గురించి తపస్సు చేసి, వరాలు పొంది లోకకంటకుడై ప్రవర్తిస్తు ఉండేవాడు. దేవతలు అతనిపైకి యుద్ధానికి రాగా వారిని అందరిని వృత్రుడు ఓడించాడు. ఇంద్రుడు చేస్తూ ఉండగా అతని చేతిలోని ఆయుధం జారీ పడింది. వృత్రుడు ఇంద్రునితో, “ ఆయుధము లేని వానిని, పారిపోవు వానిని నేను చంపను పొమ్మ” ని విడిచిపెట్టాడు. దేవతలందరూ శ్రీహరిని ప్రార్ధించగా ఆయన “ దధీచి మహామునిని అతని వెన్నుముక అడగమని చెప్పాడు. ఆయన వెన్నుముక దానం చేస్తాడు దానితో విశ్వకర్మ ఇంద్రునికి ఆయుధం చేసి ఇస్తాడు. దానితో వృత్రుని ఇంద్రుడు చంపవచ్చు” అని చెప్పాడు.

Vajrayudhamదేవతలు అలాగే దధీచిని అడిగారు. ఆయన అది దేవకార్యమని గ్రహించి “ నేను యోగశక్తితో ప్రాణం విడుస్తాను. నా ఎముకలు మీరు తీసుకొండి” అని యోగమార్గంలో శరీరాన్ని చాలించాడు. విశ్వకర్మ ఆయన వెన్నుముక్కతో వజ్రాయుధం చేసి ఇంద్రునికి ఇచ్చాడు.

Vajrayudhamఅప్పుడు దేవతలు వృత్రుని పై దండయాత్ర చేసారు. ఆ మహాయుద్ధంలో వృత్రుడు ఐరావతముతోను, వజ్రాయుధముతోను ఇంద్రుని మ్రింగాడు. ఇంద్రుడు అతని కడుపు చీల్చి చంపి బయిటకి వచ్చాడు. అలా వృత్తున్ని ఇంద్రుడు చంపేస్తాడు.

Vajrayudhamఅయితే తిరిగి బ్రహ్మ హత్యదోషం ఇంద్రుడికి అంటుకుంది. అయితే మునులు ఇంద్రునితో అశ్వమేధ యాగం చేయించి పాప విముక్తి చేశారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR