సూర్యభగవానుడు తన కూతురిని హనుమంతుడికే ఇచ్చి వివాహం చేయడానికి గల కారణం???

సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసిన వాడు, రామ లక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు.
ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి వాయుసుతుడని పేరు.

lord hanumanఆంజనేయ స్వామిని హిందువులు బ్రహ్మచారిగా భావించి కొలుస్తారు. అయితే ఆంజనేయ స్వామికి వివాహం అయిందని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే ఆంజనేయ స్వామికి నిజంగానే వివాహం అయిందా. అయితే ఎవరితో అయిందో వివరంగా తెలుసుకుందాం.

lord hanumanఆంజనేయ స్వామి వివాహం గురించి పరాశర మహర్షి ప్రస్తావించారు. సూర్య పుత్రిక అయిన సువర్చలాదేవిని వివాహం చేసుకున్నారని. అసలు ఆ వివాహం ఎలా జరిగింది. వివాహం జరిగితే ఆంజనేయస్వామిని బ్రహ్మచారిగా ఎందుకు పూజిస్తున్నాం.

suvarchaladevi and hanumanఆ వివరాలోకి వెళితే… ప్రచండమైన సూర్యుని కాంతికి ఆయన భార్య అయిన చాయా దేవి తట్టుకోలేక పుట్టింటికి చేరుతుంది. ఛాయా దేవి తండ్రి అయిన విశ్వకర్మ సూర్య కాంతిని తగ్గించి కూతురిని సూర్య భగవానుని దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు వారిద్దరికీ సూర్య తేజస్సును పుణికి పుచ్చుకొని సువర్చలాదేవి జన్మించింది.

సూర్య భగవానుడు సువర్చలాదేవి వివాహం కోసం ఆమె తేజస్సును తట్టుకోగలిగిన వరుని కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే ఆమె తేజస్సును తట్టుకొనే వరుడు ఎక్కడ దొరక్క సువర్చలా వివాహానికి మార్గం చూపమని బ్రహ్మ దేవుణ్ణి ప్రార్థించగా, అప్పుడు బ్రహ దేవుడు వాయునందనుడు, మహా పరాక్రమశాలి, ప్రచండ తేజో మూర్తి అయిన ఆంజనేయుడే సువర్చలకు తగిన వరుడని చెబుతాడు. వెంటనే సూర్యుడు ఆంజనేయడి దగ్గరకు వెళ్లి తన కూతురిని వివాహం చేసుకోమని అడుగుతాడు. ఆంజనేయుడు తన బ్రహ్మచర్య దీక్షను గురించి సూర్యునికి చెబుతాడు.

lord brahmaఆంజనేయుని బ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకం కలగదని ఒప్పందం చేసుకుని సూర్యుడు తన పుత్రిక అయిన సువర్చలా దేవితో ఆంజనేయునికి వివాహం నిశ్చయించాడు. దేవగురు బృహస్పతి వీరి వివాహ ముహూర్థాన్ని నిర్ణయించాడు.

జ్యేష్ట శుద్ధ దశమి, ఆదివారం నాడు,ఉత్తరా నక్షత్ర యుక్త సింహ లగ్నంలో, ముప్ఫై రెండుకోట్ల దేవతల దీవెనలతో వివాహం జరిగింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR