Home Unknown facts లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి ?

లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి ?

0

లక్ష్మి దేవి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. ఇంకా లక్ష్మి ధనానికి అధిష్టాన దేవత. మరి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lakshmi Devi Married Sri Mahavishnu

దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రమథనం చేసారు. అయితే ఆదిశేషువుని తాడుగా చేసి, మంధర పర్వతాన్ని కవ్వంలా మార్చి, ఆది కుర్మాన్ని ఆధారంగా చేసుకొని వారు క్షిర సాగరాన్ని మదిస్తుంటే క్షిర సాగరం నుండి అనేక వస్తువులు, ఐరావతం, కామధేనువు వంటివి ఎన్నో ఉద్బవించగా చివరగా లక్ష్మీదేవి కూడా అందులో నుండి ఉధ్బవిస్తుంది.

ఇలా జన్మించిన లక్ష్మీదేవి ఋషులను, దేవతలను, రాక్షసులను ఎవరిని దగ్గరికి వెళ్లకుండా శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఆ స్వామివారిని వివాహం చేసుకుంటుంది. ఎందుకంటే, ముందుగా లక్ష్మీదేవి ఋషులను చూడగా వారి దగరికి వెళ్లకుండా ముందుకు వెళుతుంది. అందుకు కారణం ఏంటంటే, ఋషులకి ఆగ్రహం, అహం, గర్వం ఎక్కువ అని భావించిన లక్ష్మిదేవి వారిని వారించకుండా ముందుకు వెళుతుంటుంది. అలా ముందుకు వెళుతుండగా ఆ తరువాత రాక్షసులను చూస్తుంది. వారు నివసించే ప్రాంతం పరిశుభ్రంగా ఉండదని భావించి వారిని కూడా వారించకుండా ముందుకు వెళ్లగా, ఆ తరువాత దేవతలను చూస్తుంది.

దేవతలను చూసి వారికీ ఉన్న శక్తులు వారు స్వంతంగా సంపాదించినవి కాదని, కష్టపడే తత్వం ఉన్నవారిని కాదని తలచి వారిని కాదని ముందుకు వెళుతుంది. ఇలా దేవతలను కూడా దాటి ముందుకు వెళుతుంటే అప్పుడు శేషతల్పం పైన పడుకొని ఉన్న శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి కనిపిస్తాడు. అప్పటివరకు అందరు లక్ష్మీదేవిని చూసి వారి దగ్గరికి రమ్మని పిలిస్తే, విష్ణువు మాత్రం తనని అసలు చూడకుండా ఉండిపోవడంతో ఆశ్చర్యపడ్డ లక్ష్మీదేవి స్వామివారి దగ్గరికి వెళ్లి పాదాలకు వందనం చేసి తనని పెళ్లి చేసుకోవాలని కోరగా అప్పుడు దానికి శ్రీమహావిష్ణువు అంగీకరిస్తాడు. ఇలా లక్ష్మీదేవి శ్రీమహావిష్ణవుని వివాహం చేసుకుంటుంది.

అధిష్టాన దేవత అయినా లక్ష్మీదేవి నాలుగు చేతులతో, కమలాసనం ఫై కూర్చొని ఉంటుంది. చేతిలో ఏ ఆయుదాలు ఉండవు. కలువ పూలను మాత్రమే చేత ధరించి ఉంటుంది.

Exit mobile version