Reasons Everybody Must Know About The War Between India & Pakistan

బ్రిటిష్ బానిసత్వపు బ్రతుకు నుండి బయటపడి ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాటం కారణంగా స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశం 1947 సంవత్సరంలో ప్రజాస్వామ్య దిశగా వెళుతుండగా వచ్చిన మొదటి సమస్య జమ్మూ- కాశ్మీర్. ఇక పాకిస్థాన్ భారతదేశంలో ఒక రాష్ట్రమంత ఉంటుంది, ఇండియన్ ఆర్మీలో సగం ఆర్మీ కూడా పాకిస్థాన్ కి లేదు కానీ పాకిస్థాన్ ఇండియా ని ఎదిరించడానికి ధైర్యాన్ని ఎవరు ఇస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ ఇండియా కి దూరం చేస్తే ఎవరికీ ఎందుకు లాభం? ఇన్ని సంవత్సరాలైనా ఈ సమస్య ఎందుకు అలానే ఉండిపోతుంది? ఇలానే కొనసాగితే మరొక భారీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందా? చైనాకి కాశ్మీర్ తో సంబంధం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 - india pak war

భారతదేశానికి స్వాత్యంత్రం వచ్చేప్పటికి దాదాపుగా 554 సంస్థానాలు ఉండేవి. అందులో జమ్మూ – కాశ్మీర్, నైజం, గ్వాలియర్, సిక్కిం, బెనారస్ వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని వేలసంఖ్యలో జమీందార్లు, జాగీర్ దార్లు ఉండేవారు. దీంతో ఎవరికీ వారి విడిపోకుండా అందరిని కలుపుకొని దేశాన్ని ఏకం చేయడానికి అప్పటి నాయకులూ ప్రయత్నిస్తుండగా, జమ్మూ – కాశ్మీర్ కి అప్పట్లో రాజు ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం లు ఎక్కువగా ఉన్న జమ్మూ – కాశ్మీర్ పాకిస్థాన్ తో ఉండాలా? భారతదేశంలో విలీనం చేయాలా అనే ఆలోచనలో ఉండగా, స్వాతంత్య్రం వచ్చిన కొన్ని రోజులకే పాకిస్తాన్ వాయువ్యప్రాంతపు పఠానుతెగలవారు సరిహద్దులు దాటివచ్చి కాశ్మీర్ లోకి ప్రవేశించి గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాలను ఆక్రమించారు. దీనినే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే అని పిలుస్తారు. అప్పుడు కాశ్మీర్ లో అల్లరులు చెలరేగగా సైనిక బలం లేని కాశ్మీర్ రాజు భారతదేశాన్ని సహాయం కోరి జమ్మూ – కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తానని ఒప్పందం కుదరడంతో భారత సైన్యం కాశ్మీర్ లోకి వచ్చిన పాక్ ని తరిమికొట్టింది. ఇలా భారత్ పాకిస్థాన్ కి మధ్య 1947 లో జరిగిన ఈ మొదటి యుద్ధాన్నే మొదటి కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు. ఇలా 1948 నుండి భారత్ – పాక్ రెండు దేశాలు కూడా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాలు తమవే అంటే తమవే అని వాదించడం మొదలుపెట్టారు.

2 - india pak war

ఇక భారతదేశానికి మొట్టమెదటి ప్రధాని అయ్యే అన్ని అవకాశాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉండగా, అందరి అభిప్రాయం కూడా పటేల్ గారే అని చెప్పడంతో గాంధీజీకి చాలా సన్నిహితంగా ఉండే జవహర్ లాల్ నెహ్రు తనకు ప్రధానమంత్రి పదవి కావాలని ఆశపడగా గాంధీజీ కోరిక మేరకు పటేల్ గారు ఉప ప్రధానిగా, హోం మినిష్టర్ గా బాధ్యతలను తీసుకున్నారు. ఇక దేశం ముక్కలవకుండా అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యత చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన చొరవ ఎన్నటికీ మరువలేనిది. ఈవిధంగా ఆయన ఎలాంటి గొడవలు లేకుండా దాదాపుగా అన్ని సంస్థానాలను దగ్గరికి చేసారు, నైజాం నవాబు కలిస్తే పాకిస్థాన్ లోనే కలుస్తాము ఇండియా లో కలువము అంటూ చెప్పడంతో జునాఘడ్ నవాబూ కూడా పాకిస్థాన్ లోనే కలుస్తాం అని ప్రకటించాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో నాయకులంతా అయోమయంలో ఉండగా వీరందరిని కలిపే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే తీసుకోవాలని గాంధీజీ గారు కోరగా అప్పుడు నెహ్రు గారు జమ్మూ కాశ్మీర్ మా తాతల కాలం నాటి జన్మస్థలం కావున ఆ బాధ్యతలను నేను తీసుకుంటాను అని చెప్పి జునాఘడ్ బాధ్యతలు పటేల్ గారికి ఇద్దామని, ఇక నైజాం విషయంలో ఎవరు జోక్యం చేసుకోకపోవడం మంచిదంటూ చెప్పగా ప్రధానమంత్రి నెహ్రు అంగీకారంతో పటేల్ గారు జునాఘడ్ ఆపరేషన్ పోలో నిర్వహించి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా జునాఘడ్ ని 1948 సెప్టెంబర్ 13 న భారత్ లో కలిపారు. ఆ తరువాత అదే సంవత్సరం సెప్టెంబర్ 15 వ తేదీన రష్యాలో జరిగే సోషల్ కాన్ఫిరెన్స్ కి నెహ్రు స్థానంలో పటేల్ గారు వెళ్ళాల్సింది కానీ అప్పటి నైజాం నవాబు హైదరాబాద్ లో హిందువుల పైన క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని హైదరాబాద్ లో ఉంటున్న కొండా లక్ష్మణ్ బావూజీ పటేల్ గారికి తెలియచేయడంతో అనారోగ్యం కారణంగా రష్యా వెళ్ళలేను అని నెహ్రు గారికి అబద్దం చెప్పి ఆయన్ని రష్యా పంపించి హైదరాబాద్ కి వచ్చి పోలీస్ యాక్షన్ ప్రకటించి నైజం నవాబుని అరెస్ట్ చేసి మొత్తం నైజాం ప్రాంతం అంతటిని సెప్టెంబర్ 17 వ తేదీన భారతదేశంలో కలిపారు.

3 - india pak war

ఇక జమ్మూ కాశ్మీర్ విలీన బాధ్యతలు తీసుకున్న నెహ్రు గారు, జమ్మూ కాశ్మీర్ దేశంలో విలీనం అయినప్పటికీ భారతదేశంలో ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చు కానీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం వెళ్లి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూసి రావాల్సిందే తప్ప అక్కడ ఎవరు కూడా నివాసం ఏర్పరుచుకోవడానికి వీలులేదంటూ ఆర్టికల్ 370 విధించారు. దీంతో అక్కడ నివసించే చాలా మంది అక్కడి నుండి వేరే ప్రాంతాలకు వలస పోయారు.

4 - india pak war

ఇక 1962 లో హిమాలయాల సరిహద్దు విషయంలో చైనా భారత తో యుద్ధం చేయగా అప్పటి పరిస్థితిల్లో భారత్ ఆ యుద్ధంలో ఓడిపోగా చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించింది. 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అదే అనువుగా భావించిన పాకిస్థాన్ 1965వ సంవత్సరంలో భారత్ పైన యుద్దానికి దిగింది. దీన్నే రెండవ కాశ్మీర్ యుద్ధం అని అంటారు. పాకిస్థాన్ కాశ్మీర్ కోసం కుట్ర పన్ని రహస్యంగా కాశ్మీర్ లోకి చొరబడి దొంగ దెబ్బ తీయాలని భావించింది. కానీ కాశ్మీర్ లోని ప్రజలు ఈ సమాచారాన్ని ఇండియా కి చెప్పడంతో మనమే ముందు యుద్ధం మొదలు పెట్టాలని శాస్రి గారు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇలా యుద్ధం మొత్తం 22 రోజుల పాటు జరుగగా ఆ యుద్ధంలో ఎక్కువ భూభాగం మనమే గెలుస్తూ విజయం సాదిస్తునప్పుడు పాకిస్థాన్ UN ని ఆశ్రయించింది. అప్పుడు అగ్రరాజ్యాలు ఇందులో కలుగచేసుకొని ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి పాకిస్థాన్ కి ఇవ్వాలని లేదంటే భారతదేశానికి తీవ్రమైన ఎకనామిక్ సాంక్షన్ విధిస్తామంటూ హెచ్చరిస్తూ బాగా ఒత్తిడి చేసాయి. ఆ సమయంలో ఇప్పటికే భారతదేశం ఆర్థికపరంగా చాలా వెనుక బడి ఉందని ఈ సమయంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా ఉంటె దేశం చాలా నష్టపోతుంది అని భావించి ఒప్పుకున్నారు. దీంతో యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ లో పాకిస్తాన్ రాష్ట్రపతి మొహమ్మద్ ఆయుబ్ ఖాన్ తో కలసి పాకిస్థాన్ తో శాంతి ఒప్పందం జరిగింది. ఇలా 1966 జనవరీ 10వ తేదీన శాస్త్రి గారు, ఖాన్ గారు తాష్కెంట్ వాంగ్మూలం పైన సంతకాలు చేసి ఆ రోజు పాలు తాగి పడుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే శాస్త్రి గారు తాష్కెంట్ లోనే గుండె పోటుతో మరణించారు. పాకిస్థాన్ కుట్రలో భాగంగానే అయన అక్కడ మరణించి ఉండవచ్చనే భిన్న వాదనలు వచ్చాయి.

5 - india pak war

ఇక 1971 లో ఇందిరాగాంధీ భారీ మెజారితో అధికారంలోకి వచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్థాన్ లో దమననీతికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడుతుండగా వారి పోరాటంలో భారత సైన్యం జోక్యం చేసుకోవడమే కాకుండా వారితో కలసి పాకిస్థాన్ తో యుద్ధం చేసింది. ఈ యుద్ధం లో పాకిస్థాన్ ఓడిపోగా తూర్పు పాకిస్థాన్ కి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తూర్పు పాకిస్థాన్ ఏ ఇప్పటి బాంగ్లాదేశ్. ఇదే భారత్ పాకిస్థాన్ తో చేసిన మూడవ యుద్ధంగా చెబుతారు. ఇక 1999 తొలినాళ్ళలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలవడానికి వాజపేయి చారిత్రాత్మక బస్సు యాత్ర చేసి ద్వైపాక్షిక లాహోర్ శాంతి ప్రకటన పై సంతకం చేశారు. 1999 మే, జూన్‌లలో కార్గిల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు విపరీతంగా చొరబడటంతో భారత్ – పాక్ మధ్య ఘర్షణలు తలెత్తగా అదే కార్గిల్ యుద్దానికి దారి తీసింది. ఈ యుద్ధంలో కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలను విడదీసి భారత్ సైన్యాన్ని వెనక్కి పంపాలనేది పాకిస్థాన్ ముఖ్య ఉద్దేశం. ఈ యుద్ధంలో కూడా భారత్ పాకిస్థాన్ ని చిత్తు చేసి ఓడించింది. ఇక జమ్మూ కాశ్మీర్ ని లోని యువకులను టార్గెట్ చేసి వారిలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ జైష్‌ ఏ మహమ్మద్‌ అనే ఉగ్రవాద సంస్థ ఒకటి 2000 ల సంవత్సరంలో పుట్టుకువచ్చింది. ఈ ఉగ్రవాద సంస్థ భారత్ పైన అనేక దాడులకు పాల్పడుతుంది. ఇక 2016లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరుపగా 18 మంది జవాన్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ తీవ్రవాదుల స్థావరాలపైనా దాడిచేసిన ఇండియన్ ఆర్మీ విజవంతంగా తిరిగివచ్చింది.

6 - india pak war

ఇటీవలే 2019 ఫిబ్రవరి 14 వ తేదీన 70 వాహనాల కాన్వాయ్ లో దాదాపుగా 2500 మంది జవాన్లు జమ్మూ శ్రీనగర్ జాతీయ హైవే పైన వెళుతుండగా పుల్వామాలో 44 మంది జవాన్లు ఉన్న వాహనాన్ని 350 కేజీల పేలుడు పదార్థాలు ఉన్న కారు బస్సుని ఢీకొట్టడంతో మొత్తం 44 మంది జవాన్లు మరణించారు. గత 30 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో జమ్మూ కాశ్మీర్ బలగాల పైన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పాకిస్థాన్ ఒక వైపు ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తూనే మరొక వైపు మాకు భారత్ పైన దాడులకు ఎటువంటి సంబంధం లేదనే సొల్లు మాటలు చెబుతున్నాయి.

7 - india pak war

ఇక భారత్ పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్ యుద్ధం వలన చైనాకి వచ్చే లాభం ఏంటనే విషయానికి వస్తే, చైనా సీ.పీ.ఈ.సీ అని ప్రవేశపెట్టారు. సీ.పీ.ఈ.సీ అంటే చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్. చైనా ఇది ప్రవేశపెట్టడానికి చాలా బలమైన కారణమే ఉంది. చైనా సముద్ర భాగంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే ఒకవైపు చైనా అంటే అసలు గిట్టని బర్మా, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిపైన్స్, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలు ఉన్నాయి. మరొక వైపు భారతదేశం ఉంది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే పాకిస్థాన్ నుండి రైలు, లేదా రోడ్ మార్గం ఉంటె పని చాలా తేలిక అని భావించిన చైనా, చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ని ప్రవేశ పెట్టింది. ఇక ఇక్కడే సమస్య వచ్చింది అదేంటంటే, పాకిస్థాన్ బార్డర్, చైనా బార్డర్ కలవాలి అంటే కాశ్మీర్ ఒక్కటే వారికీ ఉన్న మార్గం. కానీ జమ్మూ – కాశ్మీర్ మాత్రం భారత్ లో ఒక భాగంగా కలసి ఉంది. చైనా పాక్ తో ఈ కుట్రని 1959 లోనే మొదలుపెట్టినప్పటికీ 1990 నుండి పాక్ కి చైనా ఏ దిక్కు అవ్వడంతో ఈ బంధం మరింత బలపడింది. పాకిస్థాన్ లో గ్వాదర్ అనే ప్రదేశం మస్కట్ కి 400 కి.మీ. దూరంలో ఉండగా ఒమాన్, పెర్షియన్ దేశాలకు 500కీ.మీ దూరంలో ఉంది. ఇక్కడ నుంచే గల్ఫ్ ఆయిల్ నిక్షేపాలని తరులుతాయి. అయితే సముద్ర మార్గం నుండి 12గంటల్లో ఆఫ్రికాని చేరుకోవచ్చు. ఇక ఆఫ్రికాలోని సగం కంటే ఎక్కువ భాగం చైనా చేతుల్లోనే ఉంది. చైనా ఇక్కడ కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ కారణంగానే చైనా ఎన్నో లక్షల కోట్లు పాకిస్తాన్ పై ఖర్చు పెడుతుంది. ఒకవేళ భారత్ పెద్ద యుద్ధం చేయాల్సి వస్తే ఒకేసారి రెండు దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదు. ఒక పక్క చైనా , ఒక పక్క పాకిస్థాన్ రెండిటిటి ఎదుర్కోవాలి. ఇలా కుట్ర జరుగుతున్న అగ్ర దేశాలు మాత్రం వారికీ ఏం పట్టనట్టే చూస్తూ కూర్చుంటాయి, యుద్ధం చివరలో మాత్రం వచ్చి కలుగచేసుకొని సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక చైనా ఆశ ఏంటంటే, సీ.పీ.ఈ.సీ మొదలుపెట్టిందే తన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి కాశ్మీర్ గుండా పాక్ తో కలసి అటునుండి వారి పనిని సులువు చేసుకోవచ్చు. కానీ కాశ్మీర్ భారత్ లో ఉంటె వారు దాదాపు రూ.3 లక్షల కోట్లతో చేపడుత్ను చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్ కారకోరం హైవే కూడా భారత్ ఆధీనంలోకి వస్తుంది. ఇన్ని ఎత్తుగడల నడుమ చైనా పాకిస్థాన్ కి అన్ని విధాలా ఆర్థిక సహాయాలు చేస్తూ వస్తుందని చెబుతారు.

8 - india pak war

ఇక ఇటీవల జరిగిన పుల్వామా దాడిలో 44 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఒకవైపు శత్రు దేశాలు, ఇంకోవైపు ప్రపంచ రాజకీయాలు, మరొక వైపు ఉగ్రవాదులు ఇలా అన్ని కోణాల్లో పరిశీలిస్తే జమ్మూ – కాశ్మీర్ సమస్యే మూడవ ప్రపంచ యుద్దానికి దారితీస్తుందా అనే భయం వెంటాడుతుంది.

9 - india pak

మైనస్ డిగ్రీల చలిలో కూడా ఎటు నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియక బార్డర్ లో మనకోసం రక్షణ కవచంలా ఉంటున్న ప్రతి సైనికుడికి నా సెల్యూట్. జై హింద్……

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR