హార్ట్ ఎటాక్ బాత్ రూమ్ లో ఎక్కువగా రావడానికి కారణం ఇదే!

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. పైగా హార్ట్ అటాక్ తో మరణించే వారిలో ఆడ, మగా అనే తేడా ఉండట్లేదు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. ఇది ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడం చాలా కష్టం.

heart attackగుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. అయితే గుండె జబ్బులు ఉన్న వారు ఎక్కువగా బాత్రూం లో ఉన్న సమయంలోనే హార్ట్ ఎటాక్ కు గురవడం చూస్తూనే ఉన్నాం.

head bathబాత్ రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలోనో లేక మల విసర్జన చేస్తున్న సమయంలోనో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారన్న వార్తలు ఇటీవల చాలా వింటున్నాం. ఎన్ సీ బి ఐ మార్కెటింగ్ ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం 11 శాతం హార్ట్ ఎటాక్ లు బాత్ రూమ్ లో ఉన్న సమయంలోనే ఎక్కువగా వస్తున్నాయి. అసలు బాత్ రూమ్ లో గుండెపోట్లు ఎక్కువగా ఎందుకొస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు.

దీని వెనుక కారణం… శరీర, రక్తపు ఉష్ణోగ్రతలకు గుండెపోటుకు గల దగ్గర సంబంధమే. హృద్రోగ వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం నీటి ఉష్ణోగ్రతలే. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే స్నానం చేసేటపుడు ఓ చిన్న జాగ్రత్త పాటిస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.

చ‌ల్ల‌ని నీటితో త‌ల‌స్నానం చేసిన‌ప్పుడు ఆ నీటిని త‌ల‌పై పోసుకుంటే అప్పుడు శ‌రీరంలో ఆ భాగం చ‌ల్ల‌గా మారుతుంది. దీంతో స‌ద‌రు ర‌క్త‌నాళాలు వెంట‌నే అల‌ర్ట్ అయ్యి ర‌క్తాన్ని ఒక్క‌సారిగా పైకి పంపిస్తాయి. అయితే చ‌ల్ల‌ని నీటి వ‌ల్ల స‌హ‌జంగానే ర‌క్త నాళాలు కొద్దిగా కుచించుకుపోయిన‌ట్లు అవుతాయి. దీనికి తోడు వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే అప్పుడు త‌ల భాగం వైపు ర‌క్త స‌ర‌ఫ‌రాలో ఆటంకం ఏర్ప‌డుతుంది.

ఫ‌లితంగా ఒక్క‌సారిగా బ్ల‌డ్ ప్రెష‌ర్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే కొన్ని సార్లు ప‌క్ష‌వాతం కూడా రావ‌చ్చు. అందుక‌నే నీళ్లు మొదట ఎట్టి పరిస్థితుల్లో తలమీద పోసుకోకూడదు. చ‌ల్ల‌ని నీటితో స్నానం చేసిన‌ప్పుడు ముందుగా త‌ల‌పై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

heart attackఇక వేడి నీటితో స్నానం చేస్తే ఇలాంటి ఇబ్బంది రాదు. వేడి నీటి వ‌ల్ల ర‌క్త‌నాళాలు కొంచెం వెడ‌ల్పుగా మారుతాయి. అలాగే మలబద్దకం ఉన్న వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. మల విసర్జన కోసం కష్టపడుతున్న నేపథ్యంలో గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.

బాత్రూంకి వెళ్లినప్పుడు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకూడదు. ఒత్తిళ్లు కూడా బాత్‌ రూమ్‌లో హార్ట్ ఎటాక్ రావడానికి మరో ప్రధాన కారణం అని హెల్త్ టైన్ డాట్ కామ్ పేర్కొంది. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మెగ్రైన్ ఉన్న వారికి పైన చెప్పిన చిట్కా పాటిస్తే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR