5 Reasons Why ‘Aakaasame Nee Haddu Ra’ Is A Perfect & Inspiring Biopic

కరోనా వాళ్ళ థియేటర్స్ మూతపడిన తరువాత సగటు సినీ అభిమాని సినిమాలు లేక, OTT లో రిలీజ్ అయినా సినిమాలు నచ్చక ఎంత నిరసించి పోయాడో మన అందరికి తెలిసిందే. అయినా కూడా డిజిటల్ పల్టఫార్మ్స్ లో సినిమాలతో సరిపెట్టుకుంటున్న సినీ లవర్స్ కి ఏఈ పాండెమిక్ లో ఒక ఫుల్ మీల్స్ సినిమా చూడలేకపోయాము అని అనుకుంటుండగా వచ్చ్చింది ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమా.

సినిమా ఒక బయోపిక్ అయినప్పటికీ…దర్శకురాలు కథను రాసుకున్న విధానం, ఒక బయోపిక్ లో ప్రేమ, కలలు, జీవితం, కుటుంబం, ఆలు-మగలు ఎలా ఉండాలనేది ఆమె చెప్పిన విధానం చూసాక ఇది కదా సినిమా అంటే, ఒక విందు భోజనం, ఒక మనిషి పడ్డ కష్టాన్ని మన మొబైల్ లో లైవ్ లో చూస్తే ఎలా ఉంటాదో ఆలా తీసి అందరు ‘వాహ్ ఎమ్ సినిమా రా’ అనేలా తీశారు.

ఇది బయోపిక్ అయినప్పటికీ…ఒక బయోపిక్ కి కమర్షియల్ హంగులు అద్ది…అందరికి నచ్చేలా. అందరు మెచ్చేలా సినిమా తీయడమే కాక ఈ సినిమా లో ఆమె చెప్పిన విషయాలు కొన్ని వారం చేసుకునే ప్రయత్నం చేద్దాం పదండి…

1. కలలు కనడం – వాటిని సాధించడం

1సినిమాలో హీరో వాళ్ళ నాన్నతో పోట్లాడి తరువాత ఆ కసితో పోయి మిలిటరీలో పైలట్ గా జాయిన్ అవుతాడు. ఇది అతని ఆశయం కాదు…నాన్న మీద కసి అంతే, కట్ చేస్తే ఒక ఎనిమిది సంవత్సరాల తరువాత రిటైర్ అయ్యి…విమానాల బిజినెస్ చేయాలనీ కల కంటాడు. ఇదే విషయం ఒక పైలట్ చెప్పాడు అనుకో…మనలో తొంబై శాతం మంది నడపడానికి…కొనడానికి చాల తేడా ఉందని నవ్వేస్తాం.

ఇప్పుడు కాదు గోపినాథ్ విషయంలో కూడా అదే జరిగింది. సినిమాలో చూపించినట్టుగా ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆఖరికి ఒక దశలో ఓడిపోయినా…మల్లి అక్కడే తనని తాను వెతకొన్ని కొత్త ఆలోచనతో…తన సక్సెస్ కి షార్ట్ కట్ లో వెళ్లి పెద్ద గోల్ కొడతాడు. ఎన్ని అవంతరాలు వచ్చిన కన్నా కళలను సాధించడానికి మనం ఏలా పోరాడాలో చెప్పడానికి సినిమాలో మహా మహా పాత్రా…అతని ప్రయాణం ఒక చక్కటి ఉదాహరణ.

2. ప్రేమ- కోపం-అసూయా

4ఇక ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ కోపం ఉంటుంది…ఒకరు మన చేసే పనులకి కోప్పడుతున్నారు అంటే అక్కడే ప్రేమ ఉన్నట్టే. హీరో-తండ్రి మధ్య సీన్స్, హీరో-తల్లి మధ్య జరిగే సీన్స్….సుందరి-మహా మరియు ఆఖరికి మహా-మోహన్బాబు ల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఒక చక్కటి ఉదాహరణ.

3. కుటుంబం- కలలు-బాధ్యతలు

5ఒక సామాన్యుడు కన్నా కలలు…కలలుగానే మిగిలిపోవడానికి ఉండే అనేక కారణాల్లో మొదట ఉండేది కుటుంబం. తాను కన్నా తల్లి-తండ్రుల కోసం, చేసుకున్న భార్య కోసం, కన్నా పిల్లల కోసం ఒక సామాన్యుడు ఎక్కడో ఒక దగ్గర మనకు ఎందుకు ఇదంతా అని ఆగిపోతాడు. ఇలా ఆ రోజు…గోపినాథ్ ఆగి ఉంటె, సుధా కొంగర కి ఈ సినిమా తీయాలన్న ఆలోచన అస్సలు వచ్చేది కాదు.

మనం ఎన్ని కలలు కన్నా-కుటుంబం కోసమే ఒక మనిషి జీవితం తాను కనే కలలతో పాటు…కుటుంబం కూడా మన బాధ్యత అనే కోణం ప్రతి ఫామిలీ ఉన్న వారికీ ఈ చిత్రం చూసాక తెలుస్తుంది.

4. మగ-ఆడ – Women Empowerment

3సూర్య లాంటి స్టార్ హీరో ఉన్న సినిమా అంటే కథ అతని చుట్టే తీరాలి అతనే హీరో అనేలా తియ్యాలి. ఆలా తీసి ఉంటె ఈ సినిమాలో సుందరి పాత్రా గురించి ఈ రోజు అందరు ఇలా మాట్లాడుకోరు. అవును మీరు గమనిస్తే సూర్య వేసే ప్రతి అడుగులో సుందరి అడుగు ఉంటుంది, అతను చేసే పనిలో ఆమె సహకారం ఉంటుంది, ఒక ఇండిపెడెంట్ స్త్రీ గా సుందరి పాత్రని డిజైన్ చేసిన విధానం….Women Empowerment ని ఎంకరేజ్ చేస్తూ రాసుకున్న సీన్స్ అన్ని కూడా ఈ ఏజ్ మోడెర్న్ అమ్మాయిలు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.

సుందరి పాత్ర గమనిస్తే పెళ్లి చూపుల్లో మహాని చుసిన తరువాత అతనే కావాలని మొండిగా కూర్చుంటుంది, పెళ్లి చేసుకుంటుంది, చేసుకునే ముందే కొన్ని షరతులు పెడుతుంది, చేసుకున్న తరువాత తన సంపాదించిన ప్రతి పైసా న్మహాకి ఇస్తుంది, సగటు ఇల్లాలి లాగా బిజినెస్ చేస్తే అంటే వద్దు అని మారం చేసి ఉద్యోగం చేయమని అడగదు అంతే కాకుండా…అతను ఓడిపోతే…ఇలా పిటివాడి లాగా ఉండకు…నీ మాటలు అన్ని ఉత్తివేన అని అంటూ అతడిని రెచ్చెగొట్టడమే కాకుండా…మల్లి అతనికి నేను ఉన్న అంటూ ఒక భరోసా ని ఇస్తుంది.

5. ఆడ-మగ మధ్య బేధాలు మరియు విలువలు !

2ఇక ఆడవారైనా, మగవారైనా ఒక్కటే అనేది అంతర్లీనంగా సుధా కొంగర గారు చెప్పకనే చెప్పారు. మగవాడు కస్టపడి మాకు ఇస్తే…మేము కస్టపడి మీకు ఇస్తాము అనే లాగా సుందరి పాత్రా, ఇక ఊర్వశి గారి తల్లి పాత్రా ద్వారా, సినిమా మధ్యలో ఒక లేడీ పైలట్ ద్వారా దర్శకురాలు ఇదే చెప్పే ప్రయత్నం చేసారు.

ఇవి కాకుండా ఒకరు నమ్మింది చేసే పనిలో, సన్న కలలను సాధించడంలో ఎలాంటివ డబ్బు ప్రలోదం, పలుకుబడి, అణిచే వేసే మనుషులు ఎన్ని వచ్చిన దెనింకి లొంగకుండా సింగిల్ మైండెడ్ గా ఏలా ఉండాలో మహా పాత్రా, యత్నము కల, అతడిని నమ్ముకున్న ప్రజల కోసం అతను పట్టు వదలకుండా ఉండే పాత్ర తళుకు రచన ఈ మూవీ చుసిన ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది.

టీనేజ్ యవకులు, పెళ్ళైన యువకులు, కలలు కోసం తపించే యువకులు, పెద్దవారు ఇలా అందరికి ఈ సినిమా చాల విషయాల్లో…ఒక తరగతి గదిలో మాస్టారు చెప్పే పాఠంశం లాంటిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR