Reasons Why Goddess Sita Curse Ravana In His Previous Birth

0
9341

మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచు భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉండగా నాగటి చాలులో లభించనందుకు ఆమెకి సీత అని నామకరణం చేసాడు జనక మహారాజు. సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. మరి భూదేవి కూతురు అయినా సీతాదేవి గత జన్మ రహస్యం ఏంటి ? మరు జన్మలో సీతాదేవిగా జన్మించిన ఆ దేవి ఒక పెట్టెలో జనకమహారాజుకి ఎలా దొరికింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Seethaసీతాదేవి పూర్వ జన్మలో వేదవతి . ఈమె తండ్రి కుశధ్వజుడు , తల్లి మాలావతి . సీత జన్మించినప్పుడు వేద ఘోష విన్పించడం వల్ల వేదవతి అని పేరు పెట్టారు. తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. వేదవతి కుడా నిరంతరం విష్ణు మూర్తిని ధ్యానిస్తూ ఉండేది. అయితే ఒక రాక్షసుడు ఈమెను కోహిస్తాడు . వేదవతి ని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు. అప్పుడా రాక్షసుడు కుశాధ్వజుదుని చంపేస్తాడు. మాలావతి కుడా దుక్కం తో మరణిస్తుంది . తల్లి దండ్రులను పోగొట్టికున్న వేదవతి అడవికే వెళ్లి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది. లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరుతాడు. తాను విష్ణుమూర్తిని తప్ప ఎవరినీ వివాహము చేసుకోనని చెప్తుంది. అయినా కామము తో రావణాసురుడు వేదవతి పై చేయివేస్తాడు. పరపురుషుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టంలేని వేదవతి యోగశక్తి ద్వారా యోగాగ్నిని సృష్టించుకొని రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞా చేసి అందులో దగ్దమైపోతుంది. కొంతకాలానికి లంకా నగరం లో ఒక కమలం లో ఈమె జన్మిస్తుంది . ముందుగా రావణుడే చూస్తాడు. ఈమె జన్మ అతనికి అరిస్తామని జ్యోతిష్కులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారుపెట్టేలో పెట్టి సముద్రం లో విడిచిపెడతాడు. ఆపెట్టే కొంతకాలానికి మిధిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాతిచాలులో జనకమహరాజుకు దొరుకుతుంది.

2-Seetha

ఆవిధంగా జన్మించిన సీతాదేవిని జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇక ఆ తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.

3-Seetha

తన కుమార్తె వీర్యశుల్క అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితోబాటే లక్ష్మణునకు ఊర్మిళతోను, భరతునకు మాండవితోను, శత్రుఘ్నునకు శృతకీర్తితోను వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి కౌసల్యానంద వర్ధనా రామా ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది అని చెప్పాడు. సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది.