అతి ప్రాచీన కాలం నుండి సాగుచేస్తూ సేవిస్తున్న పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ద్రాక్ష పురాతనకాలం నుండి సాగుచేయబడుతుంది. ఇప్పటికీ ద్రాక్షను ఇష్టపడేవారు సంఖ్య తగ్గలేదు. రుచి పరంగానే కాదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

- ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. వాటన్నిటిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు – టేబుల్ గ్రేప్స్, వైన్ గ్రేప్స్ అని. టేబుల్ గ్రేప్స్ అంటే సీడ్ లెస్ గ్రేప్స్. వీటిని ఫ్రెష్ గా తినేయవచ్చు. వీటిని సలాడ్స్ లో వాడతారు. కొన్ని రెసిపీల్లో కూడా వాడతారు. ఈ గ్రేప్స్ గ్రీన్, బ్లాక్, రెడ్, పర్పుల్ కలర్స్ లో లభిస్తాయి. ఇన్ని రకాల రంగులు ద్రాక్ష పండు లో ఉండే యాంతో సియానిన్ అనే ఫ్లేవనాయిడ్ వల్ల వస్తాయి.

- యాంతో సియానిన్ ఉన్న ద్రాక్ష పండ్లు రంగులు డిఫరెంట్ గా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉంటాయి. ఆకు పచ్చ ద్రాక్ష పండ్లలో యాంతో సియానిన్ ఉండదు, అందుకనే అవి ఆకుపచ్చ గానే ఉండిపోతాయి. వైన్ గ్రేప్స్ థిక్ గా, క్రంచీ గా ఉంటాయి. ఇవి తియ్యగా ఉంటాయి. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు అన్నీ ఒకే కుటుంబానికి చెందినవే కానీ ఒక్కొక్క పండుదీ ఒకో రంగు, ఒకో సైజ్, ఒకో రుచి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనేకం.
- 100 గ్రాముల ద్రాక్ష నుంచి 69 క్యాలరీల శక్తి అందితే కొలెస్ట్రాల్ జీరో శాతం ఉంటుందన్నారు. పైపెచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, రాగి, మెగ్నీషియం, బీకాంప్లెక్స్ విటమిన్లతో పాటు ప్రధాన ఎలక్ట్రోలైట్ అయిన పొటాషియం అధికంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చు. ద్రాక్ష వల్ల ఎసిడిటిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు , బరువు తగ్గించుకోవాలనుకొనే వారు ద్రాక్షా జ్యూస్ ను తాగితే మంచి ఫలితం ఉంటుంది.

- ఇక ద్రాక్షలో అరుదైన రకం, విలువైన ఎర్ర ద్రాక్షతో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందచ్చని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా ఒక వ్యక్తికి శృంగార సామర్థ్యం తగ్గింది అంటే దానికి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. చాలా మందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి తగ్గుతుంది. అలా శృంగార సామర్థ్యం తగ్గిన వారు ఎర్ర ద్రాక్ష తినడం వలన ఉత్తేజం పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎర్ర ద్రాక్ష లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.

- శృంగారం సామర్థ్య లో పాలు ఉన్న వారు రోజూ వారి ఆహారం లో వీటిని భాగం చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఎరుపు ద్రాక్ష లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీర కణజాలం పాడవకుండా రక్షిస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది. ఎరుపు రంగు ద్రాక్షలను తినడం వల్ల శరీరంలో రక్త కణాల్లోని మలినాలు తొలగిపోతాయి.. ఎర్ర రంగు లో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల అధిక బరువు ఉన్నవారు కూడా సన్నబడతారు. వీటితో పాటు గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, రాకుండా ఉంటాయి.

- వృధాప్యం కారణంగా వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. ఎరుపు రంగు ద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తం లో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని దీని ఫలితంగా గుండె పోటువచ్చే అవకాశం తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎరుపు రంగు ద్రాక్షలను తింటుంటే రక్త సరఫరా మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. షుగరు ఉన్నవారు ఎర్ర రంగు ద్రాక్షలను తినడం ఆరోగ్యానికి మంచిది. దీంతో వారి రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
