సోరియాసిస్ ను నివారించుకోవడానికి రెమెడీస్ మీ కోసం

చలికాలం రాగానే ఎంతోమంది అనేకరకాల చర్మ సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య సోరియాసిస్. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని కేవలం సాధారణ చర్మవ్యాధిగా పరిగణించడానికి వీలు లేదు. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మవ్యాధి. సోరియాసిస్ వ్యాధిగ్రస్థులలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవవచ్చు.

సోరియాసిస్వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయంప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి ముందు వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మనశరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి.

కొన్నికుటుంబాలలో సోరియాసిన్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది.

సోరియాసిస్సోరియాసిస్ ప్రభావం : సోరియాసిస్ ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణాపాయం జరగదు. కాని వ్యాధితీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో వికటించిన వ్యాధినిరోధక శక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్‌ఫ్లమేషన్ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్థులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్ ను నివారించుకోవడానికి కొన్ని రెమెడీస్, మెడికేషన్స్ ఉన్నాయి.

అలోవెర:

Alveraఅలోవెరా ఆకులలోని జెల్స్ ను ఉపయోగించుకోవచ్చు. దీన్ని చర్మానికి ఒక ఆయింట్ మెంట్ లా అప్లై చేయాలి. ఇది చర్మం యొక్క దురదను తొలగిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. అలాగే అలోవెరాతో తయారుచేసిన క్రీములను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే అలోవెరా మాత్రలను మాత్రం తీసుకోకూడదు. ఇవి చాలా ప్రమాధకరమైనవి.

డెడ్ సీసాల్ట్ :

డెడ్ సీసాల్ట్సోరియోసిస్ నివారించడానికి వివిధ మార్గాలున్నాయి. వాటిలో డెడ్ సీ సాల్ట్ టిప్ ఒకటి. చర్మం దురద తగ్గించడంతో పాటు చాలా ఎఫెక్టివ్ గా మాన్పుతుంది. వేడినీటిలో డెడ్ సీ సాల్ట్ ను మిక్స్ చేసి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్ ను అప్లై చేయడం మర్చిపోకండి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ఇతర ప్రయోజనాలతో పాటు, సోరియాసిస్ కు ఇది ఒక పాపులర్ హోం రెమెడీ. సోరియోసిస్ ను నివారించడానికి ఉపయోగిస్తారు . చర్మం మీద బర్నింగ్ సెన్షేషన్ ఉన్నట్లైతే వెనిగర్ ను వాటర్ తో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. వారంలో మూడు, నాలుగు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

టీట్రీ ఆయిల్:

టీట్రీ ఆయిల్టీట్రీ ఆయిల్లో యాంటీ సెప్టిక్ కాంపోనెంట్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది .అయితే దీనికి మెడికల్ పరంగా ఎలాంటి నిర్ధారణ లేదు. కానీ దీని ఉపయోగం వల్ల చాలా మంది దీన్ని షాంపులలో ఉపయోగిస్తుంటారు. షాంపులతో ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు , తలలో మొటిమలు నివారించబడుతాయి. అలర్జీ ఉన్నవారు దీన్ని ఉపయోగించకూడదు.

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్కేయాన్ పెప్పర్ లో క్యాప్ససిన్ పుష్కలంగా ఉంటుంది ఇది నొప్పిని తగ్గిస్తుంది. దీంతో తయారుచేసిన క్రీములు, ఆయింట్ మెంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చర్మం రెడ్ నెస్ తగ్గించడానికి చర్మం పై పొక్కులు నివారించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మరియు నొప్పి నివారణల కోసం వీటిని ఉపయోగిస్తారు.

ఓట్స్:

Oatsఇది ఒక ఉత్తమ పదార్థం. అయితే సోరియోసిస్ ను నివారిస్తుందనడానికి ఎలాంటి నిర్ధాణలు లేవు. . అయితే ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతుంటారో అలాంటి వారు ఓట్స్ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుసుకున్నారు.

పసుపు:

పసుపుసోరియాసిస్ నివారణకు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ . ఎందుకంటే వీటిలో యాంటీ సెప్టిక్ విలువలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికైనా ఇది బెస్ట్ గా పనిచేస్తుంది. సోరియాసిస్ నివారణకు హోం రెమెడీస్ మంచి ఎంపిక, ఇవి హేర్బల్ నేచర్ కలిగి ఉంటాయి . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . అయితే వీటిని సెల్ఫ్ చికిత్సగా తీసుకోకుండా డాక్టర్ సలహాతో ప్రారంభించడం మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR