Rendava Bhadradhiga peruganchina Ramalayam

0
2746

మన తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద రామాలయం అంటే గుర్తొచ్చేది భద్రాద్రి. అయితే భద్రాచలంలో వెలసిన రాముడికి ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. అందుకే భద్రాచలం ఒక పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా భద్రాద్రి రాముడిని పోలి ఉండి ఈ ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి అని చెబుతున్నారు. అందుకే ఈ ఆలయాన్ని రెండో భద్రాద్రిగా పిలుస్తున్నారు. మరి ఈ రామాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ramalayamతెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కోదాడ లోని తమ్మరబండపాలెం లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సవంత్సరం శ్రీరామనవమికి భద్రాచలంలో మాదిరిగానే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా కలసి ఒక్కటిగా రాములోరి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఆనావాయితీగా వస్తుంది. ramalayamఈ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న రాముడి రూపం నాలుగు చేతులతో భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం. ఇలా రాముడు వైకుంఠ రాముడిగా దర్శనమిచ్చే ఆలయాలలో ఇది రెండవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక భద్రాచలం లో రామకోటి ఉత్సవాలు నిర్వహించినట్లే ఈ ఆలయంలో కూడా రామకోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ramalayamసీతారాములు కొలువై ఉన్న ఈ ఆలయానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా స్థల పురాణం చెబుతుంది. దాదాపుగా 80 సంవత్సరాల క్రితం స్వామివారి మూలవిరాట్టు పక్కన ఉన్న ఒక పుట్టలో దొరికిన విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నాలుగు పంచ లోహ విగ్రహాలతో పాటుగా ఇక్కడ ఒక రాతి విగ్రహం కూడా ప్రతిష్టించబడి ఉంది. ramalayamఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఆలయంలో శ్రీ రామనవమి రోజున సీతారాముల కళ్యాణం చూడటానికి చుట్టూ ప్రక్కల అనేక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.ramalayam